Home Loan | హోం లోన్‌ను 10 ఏళ్లు ముందుగానే ముగించాలంటే ఏం చేయాలి.. చాట్ జీపీటీ ఆసక్తికర సమాధానం..
Home Loan | బెంగళూరుకు చెందిన దంపతులు నెలకు రూ.2 లక్షల ఆదాయం పొందుతున్నారు. రూ.70 లక్షల హోం లోన్‌పై వారు నెలకు రూ.58,744 ఈఎంఐ చెల్లిస్తున్నారు. ఈ లోన్ కాలవ్యవధి 25 సంవత్సరాలు కాగా, వడ్డీ రేటు సుమారు 9 శాతంగా ఉంది.
Home Loan | బెంగళూరుకు చెందిన దంపతులు నెలకు రూ.2 లక్షల ఆదాయం పొందుతున్నారు. రూ.70 లక్షల హోం లోన్‌పై వారు నెలకు రూ.58,744 ఈఎంఐ చెల్లిస్తున్నారు. ఈ లోన్ కాలవ్యవధి 25 సంవత్సరాలు కాగా, వడ్డీ రేటు సుమారు 9 శాతంగా ఉంది. అదనంగా రూ.15వేలు కార్ లోన్ ఈఎంఐ, రూ.50వేలు గృహ ఖర్చులు, రూ.20వేలు పిల్లల ఖర్చులు, రూ.20వేలు ఎస్ఐపీ పెట్టుబడి, రూ.10,000 హెల్త్ ఇన్సూరెన్స్ కలిపి మొత్తం నెలవారీ ఖర్చు రూ.1,73,744గా ఉంది. దీంతో వారికి రూ.26,256 సర్‌ప్లస్ మిగులుతోంది. ఈ పరిస్థితిలో హోం లోన్‌ను 10 సంవత్సరాలు ముందుగానే ఎలా ముగించాలనే ప్రశ్నకు ChatGPT ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.
ఈఎంఐ మొత్తాన్ని పెంచాలి..
ఈ లక్ష్యాన్ని సాధించాలంటే రెండు ముఖ్యమైన చర్యలు అవసరమని సూచించింది. మొదటిగా వెంటనే నెలవారీ ఈఎంఐని రూ.12వేలు పెంచాలి. రెండవది ప్రతి సంవత్సరం క్రమబద్ధంగా ప్రీ-పేమెంట్ చేయాలి. రూ.70 లక్షల లోన్‌ను 15 సంవత్సరాల్లో పూర్తిచేయాలంటే సుమారు రూ.71,000 ఈఎంఐ అవసరం. ప్రస్తుతం ఉన్న సర్‌ప్లస్‌తో ఈఎంఐని రూ.70,744 వరకు పెంచడం సాధ్యమే. ఈ పెంపు తర్వాత కూడా సుమారు రూ.14వేల బఫర్ మిగులుతుంది. సంవత్సరానికి రూ1.50 లక్షల బోనస్ వస్తుందని ఆ దంపతులు చెప్పారు. అందులో కనీసం రూ.1.2 లక్షలను ప్రతి సంవత్సరం లోన్ ప్రిన్సిపల్ తగ్గించడానికి వినియోగించాలని సూచించింది. మిగిలిన రూ.30వేలను ఎమర్జెన్సీ అవసరాల కోసం దగ్గర పెట్టుకోవాలి. లోన్ ప్రారంభ దశలో వడ్డీ భాగం ఎక్కువగా ఉన్నందున, ప్రారంభ సంవత్సరాల్లో ప్రీ-పేమెంట్ చేయడం అత్యంత ప్రభావవంతమని చాట్‌జీపీటీ పేర్కొంది.
కార్ లోన్‌ను త్వరగా ముగిస్తే..
కార్ లోన్ వడ్డీ రేటు 10 శాతం కంటే ఎక్కువైతే, దాన్ని త్వరగా ముగించడం మంచిదని సూచించింది. ఒక బోనస్ సైకిల్‌ను ఉపయోగించి ఆ లోన్‌ను క్లోజ్ చేయవచ్చు. ఆ తర్వాత నెలకు రూ.15వేల మొత్తాన్ని హోం లోన్‌కు మళ్లిస్తే, హోం లోన్ ఈఎంఐని రూ.85వేల వరకు పెంచుకోవచ్చు. ఈ ఒక్క మార్పుతోనే లోన్ కాల్యవవధి 15 సంవత్సరాల కన్నా తక్కువకు తగ్గే అవకాశం ఉంటుంది. రూ.20వేలు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీని ఆపకూడదని చాట్‌జీపీటీ స్పష్టంగా సూచించింది. సంపద సృష్టి, రుణ తగ్గింపు రెండూ సమాంతరంగా కొనసాగాలి. రూ.10వేల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కొనసాగించాలి. అయితే ఈ ప్రీమియం విలువను సమీక్షించి ఫ్యామిలీ ఫ్లోటర్ వంటి ఎంపికలు పరిశీలించడం మంచిదని సూచించింది.
స్టెప్ బై స్టెప్ ఇలా..
మొదటగా రూ.6-8 లక్షల ఎమర్జెన్సీ ఫండ్‌ను క్రమంగా నిర్మించాలి. తర్వాత ఈఎంఐని రూ.12వేలు పెంచి బ్యాంక్ వద్ద టెన్యూర్ తగ్గించమని కోరాలి. ప్రతి సంవత్సరం రూ.1.2 లక్షల ప్రీ-పేమెంట్ చేయాలి. ప్రీపేమెంట్ తర్వాత ఎప్పుడూ ఈఎంఐ తగ్గించకుండా టెన్యూర్ తగ్గించేలా చూడాలి. కార్ లోన్ ముగిసిన తర్వాత దాని ఈఎంఐని హోం లోన్‌కు మళ్లించాలి. జీతం పెరిగిన ప్రతిసారి ఈఎంఐని 10 శాతం పెంచాలి. ఈ కాలంలో లైఫ్‌స్టైల్ ఖర్చులను నియంత్రించడం అత్యంత ముఖ్యం. కొత్త లోన్లు తీసుకోవడం, అవసరం లేని ఖర్చులు చేయడం నివారించాలి. అయితే ఈ వ్యూహం క్లిష్టమైనది కాదు, క్రమశిక్షణతో అమలు చేస్తే సరిపోతుంది. అదనపు ఈఎంఐ, వార్షిక ప్రీ-పేమెంట్, కార్ లోన్ మళ్లింపు అనే మూడు అంశాలను నిరంతరం కొనసాగిస్తే 10-15 సంవత్సరాల్లో లోన్ పూర్తవుతుంది. ఒక పెద్ద చెల్లింపు కంటే క్రమశిక్షణతో చేసే చిన్న చర్యలే విజయానికి కీలకం అని చాట్ జీపీటీ సూచించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
- ●Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
- ●Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..
- ●Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్
- ●Harish Rao | జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్..: హరీశ్ రావు
- ●Miss Universe India 2026 | కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఎవరీ కాజియా లిజ్ మెజో..?

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం

Chicken Waste | 100 టన్నుల చికెన్ వ్యర్థాలను ఏపీ తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు..

Rashmika Mandanna | ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి వేడుకలో విజయ్ , రష్మిక - గాయం నుంచి కోలుకున్న నేషనల్ క్రష్






