త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఈత‌కెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెల‌కొంది. రాయికోడ్ మండ‌ల ప‌రిధిలోని రామోజీప‌ల్లిలో ఓ ముగ్గురు చిన్నారులు ఈత‌కెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On May 18, 2026, 9.31 am IST

Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఈత‌కెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
Advertisement

Sangareddy | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెల‌కొంది. రాయికోడ్ మండ‌ల ప‌రిధిలోని రామోజీప‌ల్లిలో ఓ ముగ్గురు చిన్నారులు ఈత‌కెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

రామోజీప‌ల్లి గ్రామానికి చెందిన ఓ ముగ్గురు చిన్నారులు స‌ర‌దాగా ఆడుకుంటూ.. స్థానికంగా ఉన్న చెరువు వ‌ద్ద‌కు వెళ్లారు. ఈత కొడుదామ‌ని చెప్పి.. చెరువులోకి దిగారు. వారికి ఈత రాక‌పోవ‌డంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. రాత్ర‌యినా కూడా పిల్ల‌లు ఇంటికి రాక‌పోవ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన వారి త‌ల్లిదండ్రులు ఊరంతా గాలించారు. గ్రామానికి స‌మీపంలో ఉన్న చెరువు వ‌ద్ద పిల్ల‌ల దుస్తులు, చెప్పులు క‌నిపించాయి.

దీంతో చెరువులో గాలించ‌గా, ముగ్గురు చిన్నారుల మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మృతుల‌ను నిరంజ‌న్(12), బ‌స‌వ‌రాజ్‌(10), మ‌నోజ్‌(12)గా గుర్తించారు. మృతుల త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement