త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddam Vamsi Krishna | ప్రాణ‌హిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా క‌ల‌.. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేలా కృషి: ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ

Gaddam Vamsi Krishna | కాకా వెంకటస్వామి (Kaka Venkataswamy) ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నామని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) అన్నారు.

G

Telangana | Published On Oct 5, 2026, 4.41 pm IST

Gaddam Vamsi Krishna | ప్రాణ‌హిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా క‌ల‌.. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేలా కృషి: ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ
Advertisement

Gaddam Vamsi Krishna | త్రినేత్ర న్యూస్‌: కాకా వెంకటస్వామి (Kaka Venkataswamy) ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నామని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) అన్నారు. TOMCOM ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ సెంట‌ర్స్ (ATCs) ద్వారా ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలను విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల అని చెప్పారు. దివంగత ప్రజానాయకుడు కాకా వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ ఉన్న వెంక‌ట‌స్వామి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ప్రాంతంలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణ‌హిత‌-చేవెళ్ల‌ ప్రాజెక్టును (Pranahitha Chevella Project) ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రి సీఆర్. పాటిల్‌తో చర్చించామ‌న్నారు. ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడి జరిగిన నేపథ్యంలో కాకా కలను సాకారం చేసే దిశగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకా వెంకటస్వామి చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. శరీరానికి బుల్లెట్ తగిలినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా అని కొనియాడారు. `తెలంగాణ వచ్చిన తర్వాతే నా ఆఖరి శ్వాస విడుస్తా` అని పట్టుదలతో చెప్పిన కాకా.. రాష్ట్రాన్ని సాధించి చూపించారన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను కాకా చూసి ఉంటే ఎంతో బాధపడేవారని చెప్పారు.లక్షలాది మంది నిరుపేదలకు, కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇప్పించి కాకా అండగా నిలిచారని పేర్కొన్నారు అయితే గత పదేండ్ల‌లో జరిగిన భూకబ్జాలు, భూదందాలు, ఇసుక మాఫియాను చూస్తే బాధతో పాటు ఆగ్రహం వ‌స్తున్న‌ద‌ని తెలిపారు.

కార్మికుల పెన్షన్ రూ.10 వేలకు పెంచాలి

కాకా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల కోసం తీసుకొచ్చిన పెన్షన్ (Pensions) ఇప్పటికీ కేవలం రూ.500గా ఉండటం శోఛ‌నీయమని విమ‌ర్శించారు. కార్మికుల పెన్షన్‌ను రూ.10,000కు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతున్నామని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) విషయంలో కాకా వెంకటస్వామి, మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోరాడి సుమారు రూ.10 వేల కోట్ల రుణభారం నుంచి సంస్థను బయటకు తీసుకురావడానికి కృషి చేశార‌ని గుర్తుచేశారు.

ఆర్ఎఫ్‌సీఎల్‌ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్న‌ద‌ని, అయితే సరైన నిర్వహణ లేకుండా ఢిల్లీ పెత్తనంతో సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు పూర్తిస్థాయిలో యూరియా (Urea) అందేలా కంపెనీ యాజమాన్యం తీరుపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. `కాకా చూపిన పోరాట బాటలోనే ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తాం. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత` అని వంశీకృష్ణ అన్నారు.

Advertisement
Advertisement