Bengaluru | మద్యం సేవిస్తూ నడిరోడ్డుపై హల్‌చల్.. ముగ్గురు వైద్యులు అరెస్ట్
Bengaluru | బెంగళూరు (Bengaluru)లో ముగ్గురు వైద్యులు (doctors) హల్‌చల్ చేశారు. రద్దీగా ఉండే రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తూ మద్యం తాగుతూ బీభత్సం సృష్టించారు.
Bengaluru | బెంగళూరు (Bengaluru)లో ముగ్గురు వైద్యులు (doctors) హల్‌చల్ చేశారు. రద్దీగా ఉండే రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తూ మద్యం తాగుతూ బీభత్సం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆ ముగ్గురు వైద్యులను గుర్తించి అరెస్ట్ చేశారు.
బెంగళూరు నగరంలోని బీటీఎం లేఅవుట్ (BTM Layout)లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఒకే బైక్‌పై వెళ్తూ కనిపించారు. అందులో చివరన కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. చేతిలో ఉన్న బీర్ (Beer bottle)ను తాగుతూ కనిపించాడు. వీరు ట్రాఫిక్‌లో అడ్డదిడ్డంగా దూసుకెళ్తూ కనిపించారు. అటుగా వెళ్తున్న వాహనదారులు వీరి చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి బైక్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక అరెస్ట్ అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. బెంగళూరు నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోయినట్లు ట్రాఫిక్ పోలీసులు (Bengaluru Traffic Police) తెలిపారు. మార్చి 16 నుంచి 22 వరకు నగరవ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో 634 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. అతివేగంతో వాహనాలు నడిపిన కేసుల్లో రూ.1.29 లక్షల ఫైన్ వసూలు చేసినట్టు వెల్లడించారు.
Also Read..
పాక్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు..? క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?






