White House | పాక్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు..? క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్
White House | అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ (Pakistan) మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ (White House) తాజాగా స్పందించింది. ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.
International | Published On Mar 24, 2026, 12.49 pm IST
White House | అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ (Pakistan) మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వారమే ఇరాన్-అమెరికా (Iran - US officials meeting ) మధ్య శాంతి చర్చలు ఇస్లామాబాద్ వేదికగా జరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నెర్‌లు త్వరలో ఇరాన్ ప్రతినిధులతో పాక్ వేదికగా భేటీ కాబోతున్నారంటూ అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ (White House) తాజాగా స్పందించింది. ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.
ఇరాన్ ప్రతినిధులతో చర్చలపై అమెరికా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) తెలిపారు. ఇవి అత్యంత సున్నితమైన దౌత్యపరమైన చర్చలు అని పేర్కొన్నారు. వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించే వరకూ ఈ చర్చలపై వచ్చే ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. వాటిని తుది నిర్ణయాలుగా పరిగణించకూడదని పేర్కొన్నారు.
ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై చేయాలనుకున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేయాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ ఈ ప్రకటన చేసిన తర్వాత ఓ కీలక అంశం తెరపైకి వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్యలకు పాకిస్థాన్ వేదిక కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్‌తో ఆసిమ్ మునీర్ చర్చలు జరిపినట్లుగా కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆ వార్తలపై వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.
Also Read..
విద్యా కమిషన్ సిఫారసు 18 శాతం.. కేటాయింపు 8 శాతమా? : బీఆర్ఎస్‌వీ
సంబంధిత వార్తలు

Khawaja Asif | పీవోకే నిరసనకారులు కూడా భారత్‌లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
జులై 29, 2026

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
జులై 25, 2026

Nigeria | ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. నైజీరియాలో పిల్లలపై తీవ్ర ప్రభావం..
జులై 21, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా



