Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
దిగ్గజ దర్శకులు మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి ఓ తెలుగు సినిమాకు కథను అందించారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఎంతో మంది కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Jul 30, 2026, 8.11 pm IST
Tollywood | ఇండియన్ సినిమాను మలుపుతిప్పిన టాప్ డైరెక్టర్లు మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి ఓ తెలుగు సినిమాకు కథను అందించారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకుంది. ఆ సినిమానే గాయం. జగపతిబాబు, ఊర్మిళ, రేవతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1993లో రిలీజైంది. అక్కినేని నాగేశ్వరరావు అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. తాను చదువుకునే రోజుల్లో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్స్ ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ గాయం మూవీని తెరకెక్కించారు.
టాలెంట్‌కు ఫిదా...
శివ సినిమాతో వర్మ దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారిపోయాడు. అతడికి చాలా మంది డైరెక్టర్లు సైతం ఫ్యాన్స్‌గా మారిపోయారు. వారిలో మణిరత్నం కూడా ఒకరు. వర్మ క్రియేటివిటీ, డైరెక్షన్ టాలెంట్‌కు ఫిదా అయినా మణిరత్నం అతడితో తన కథలను గురించి చర్చించేవారు. రామ్‌గోపాల్ వర్మ కుడా తన ఐడియాలను మణిరత్నానికి వినిపించేవారు.
రెండు ఫ్లాప్‌లు...
అంతం, రాత్రి సినిమాలు ఫ్లాపవ్వడంతో వర్మపై విమర్శలు వచ్చాయి. ఆ పరాజయాల నుంచి బయటపడే ప్రయత్నంలోనే గాయం ఐడియా రెడీ చేసుకున్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆ కథను డెవలప్ చేయడంలో మణిరత్నం సాయం కోరారు. అలా ఇద్దరూ కలిసి ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. డైరెక్షన్ మాత్రం రామ్‌గోపాల్ వర్మ చేశారు. ఈ దిగ్గజ దర్శకుల కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక తెలుగు మూవీగా గాయం నిలిచింది.
టర్నింగ్ పాయింట్...
చిన్న సినిమాలతో హీరోగా నిలదొక్కుకోవడానికి ఇబ్బందులు పడుతోన్న జగపతిబాబు కెరీర్‌కుఈ మూవీ గాయం ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. జగపతిబాబు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న మొదటి మూవీ కూడా ఇదే. అంతం తర్వాత ఊర్మిళ తెలుగులో నటించిన సెకండ్ మూవీ ఇది. ఓ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. లెజెండరీ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడు శ్రీ గాయం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. శ్రీ సమకూర్చిన పాటలు అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. విలన్‌గా కోట శ్రీనివాసరావుకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది.
ఆరు నంది అవార్డులు...
గాయం సినిమాకు ఆరు నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ సహాయ నటిగా ఊర్మిళతో పాటు మరో ఐదు విభాగాల్లో ఈ సినిమా పురస్కారాలను దక్కించుకుంది. జగపతిబాబు, శ్రీ, ఊర్మిళ, కోట శ్రీనివాసరావుతో పాటు ఎంతో మంది కెరీర్‌ను మలుపుతిప్పి కల్ట్ క్లాసిక్‌గా గాయం నిలిచింది.
గాయం సినిమాకు సీక్వెల్‌గా గాయం 2 వచ్చింది. ఈ సీక్వెల్‌లో జగపతిబాబు హీరోగా నటించగా.. రామ్‌గోపాల్ వర్మ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సీక్వెల్ మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు – సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
జులై 30, 2026

Chiranjeevi | షూటింగ్ పూర్తయిన రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర – త్రిష సీన్లు కట్?
జులై 30, 2026

Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు – భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
- ●Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ ప్రేమలో పడిందా? - బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు వైరల్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం



