Texas Oil Refinery | అమెరికాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు
Texas Oil Refinery | అమెరికాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో (oil refinery) భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్ (Texas)లోని పోర్ట్ ఆర్థర్ (Port Arthur)లో గల వాలెరో రిఫైనరీలో (Texas Oil Refinery) పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
International | Published On Mar 24, 2026, 1.10 pm IST
Texas Oil Refinery | అమెరికాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో (oil refinery) భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్ (Texas)లోని పోర్ట్ ఆర్థర్ (Port Arthur)లో గల వాలెరో రిఫైనరీలో (Texas Oil Refinery) పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్ముకుంది. రిఫైనరీలోని ఓ ఇండస్ట్రియల్ హీటర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
పేలుడు సమయంలో భారీ శబ్ధం వచ్చినట్లు స్థానికులు చెప్పారు. కొన్ని మైళ్ల దూరం వరకు భూమి కంపించినట్లు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను షెల్టర్లకు తరలిస్తున్నారు. ఇక ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని కీలకమైన చమురు శుద్ధి కేంద్రాల్లో వాలెరో రిఫైనరీ ఒకటి. ఇందులో రోజుకు 3,80,000 బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్‌ను రిఫైన్ చేస్తారు.
ఇరాన్‌పై దాడి వల్ల ప్రస్తుతం అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటాయి. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి యూఎస్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ పెరుగుదల దాదాపు 40 శాతం వరకు ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో పేలుడు ఘటన కారణంగా పరిస్థితి మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/kfdmnews/status/2036247883637305768
Also Read..
పాక్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు..? క్లారిటీ ఇచ్చిన వైట్‌హౌస్
క్షయవ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు
సంబంధిత వార్తలు

Errabelli Dayakar Rao | TTA ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం.. పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
జులై 20, 2026

LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
జులై 6, 2026

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



