criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటావా
ముఖ్యమంత్రి గారికి ఎక్కడ, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. స్కూల్ పిల్లల ముందు బూతులు మాట్లాడుతారు. ఉపాధ్యాయులను అవమానపరిచేలా.. మీరు చదువు చెప్పిన ఇంజనీరింగ్ పిల్లలకు కనీసం దరఖాస్తు కూడా రాయరాదు అని హేళన చేశారు.
ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి*
కాంగ్రెస్ మేనిఫెస్టోను సమాధి చేశారా?
32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవీ?
ప్రశ్నించే గొంతులపై ఏసీబీ, సీఐడీ అక్రమ కేసులు
ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, ఎవరూ భయపడొద్దు
చాక్ పీస్ కొనేందుకు పైసల్లేవు, స్కావెంజర్లకు జీతాల్లేవు
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కంప్లీట్ ఫెయిల్
అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే..
ఉద్యోగుల ఓపీఎస్, డీఏల సాధన కోసం బీఆర్ఎస్ పక్షాన పోరాడుతాం
.....................................................................
త్రినేత్ర.న్యూస్ : తన పాలనలో అంతులేని వైఫల్యాలు మూటగట్టుకొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రపంచదేశాల్లో అద్భుతంగా రాణిస్తూ..మన రాష్ట్రానికి పేరు తెస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అని ముఖ్యమంత్రి అనడం అత్యంత దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ పిల్లలను, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి అసలు మైండ్ సరిగా లేదని ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు, ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు జన చైతన్య యాత్ర పేరిట నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగులు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే..
జిల్లా అధ్యక్షుడు దేవరాజు గారు క్యాంప్ ఆఫీస్ కు వచ్చి వినతిపత్రం ఇస్తామంటే, మీరెందుకు రావడం, మీ పోరాటానికి మద్దతుగా నేనే స్వయంగా మీ వద్దకు వస్తానని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చాను.
రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ గారు, జిల్లా అధ్యక్షుడు దేవరాజు గారు, ప్రధాన కార్యదర్శి శశి కుమార్, రఘురామ, ఉదయశ్రీ గారితో పాటు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓపీఎస్ సాధన కోసం బలంగా పోరాడుతున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ హృదయపూర్వక నమస్కారాలు.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మీరు అడుగుతున్నది ఎలాంటి గొంతెమ్మ కోరిక కాదు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరికి వచ్చి, చేతులు జోడించి, తాము అధికారంలోకి రాగానే ఓపీఎస్ తెస్తామని ఆపద మొక్కులు మొక్కి నమ్మబలికారు.

పుణ్యకాలం సగం దాటిపోయింది
ప్రభుత్వం ఏర్పడి పుణ్యకాలం సగం దాటిపోయి 32 నెలలు అవుతోంది. 30 నెలల పాటు మీరంతా ఓపికగా ఎదురుచూసి, అన్ని వేదికల మీద విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్లే ఈరోజు రోడ్డెక్కారు.ఎన్నికల ముందు మాత్రం ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు అన్నీ వెంటనే ఇస్తామని, అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామని, ఓపీఎస్ తెస్తామని మేనిఫెస్టోలో పెట్టి నమ్మించారు. ఈరోజు మీరు ఇచ్చిన గ్యారెంటీలను సమాధి చేశారా? ఆ మేనిఫెస్టో ఈ రోజు ఒక చిత్తుకాగితంగా మారిపోయిందా? ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమించే ఉద్యోగులతో పెట్టుకున్న వారు ఎవ్వరు బాగుపడలేదు. సరైన సమయంలో వారు మీకు తప్పక గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్ సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే మీకోసం గళం విప్పుతాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు హామీ ఇస్తున్నాను.
ప్రశ్నించే గొంతులపై కక్ష సాధింపు
ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతోంది. అక్రమ కేసులు, విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ ఎంక్వైరీలు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేం దగ్గరుండి కాపాడుకుంటాం.కనీసం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా 8 నెలల పాటు ఈ ప్రభుత్వం కట్టలేదు. అసెంబ్లీలో మేము నిలదీస్తే అప్పుడు కట్టడం మొదలుపెట్టారు. కాంట్రిబ్యూషన్ కూడా కట్టకుండా మిమ్మల్ని ఎలా మోసం చేస్తోందో ఒక్కసారి ఆలోచించాలి.

పిల్లలను అవమానిస్తాడా?
ముఖ్యమంత్రి గారికి ఎక్కడ, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. స్కూల్ పిల్లల ముందు బూతులు మాట్లాడుతారు. ఉపాధ్యాయులను అవమానపరిచేలా.. మీరు చదువు చెప్పిన ఇంజనీరింగ్ పిల్లలకు కనీసం దరఖాస్తు కూడా రాయరాదు అని హేళన చేశారు. ఇది మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానించడమే.ఉపాధ్యాయులు తమ స్కూళ్ల సమస్యలు అడగొద్దట.నేనెందుకు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావా. నువ్వు బాగా చేశావో లేదో పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజలు మార్కులు వేయాలి.విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా స్కూల్ గ్రాంట్స్ రాలేదు, స్కూళ్లలో చాక్ పీస్ కొనుక్కునేందుకు కూడా పైసలు లేవు. స్కావెంజర్లకు 7 నెలల జీతాలు లేవు. పిల్లలకు ఇప్పటిదాకా యూనిఫామ్స్ రాలేదు. మన ఊరు మన బడి ఆపేశారు.మధ్యాహ్న భోజనంలో గుడ్ల ధరలు పెరిగినా, కనీసం పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని ముఖ్యమంత్రి నువ్వు. ఎంఈఓ, డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్కటీ నింపలేదు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అన్నావు, ఉత్తిదే.
రీయంబర్స్ మెంట్ లేదు..డీఎస్సీ లేదు
పిల్లల ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెగా డీఎస్సీ అన్నావు, ఉత్తిదే అయిపోయింది. విద్యాశాఖలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినట్టు..ఇంతటి వైఫల్యాలు పెట్టుకుని, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా రాణిస్తూ మన రాష్ట్రానికి పేరు తెస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని ముఖ్యమంత్రి 'క్రిమినల్ వేస్ట్' అనడం అత్యంత దారుణం.ఆ పిల్లలను, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించారు. ఆయనకు అసలు మైండ్ సరిగా లేదు. మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు, ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు అన్నట్టుగా మీ పోరాటాన్ని సాగించండి.
సీపీఎస్ రద్దు, ఓపీఎస్ సాధన, 6 పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం కోసం మీరు చేసే ఈ న్యాయబద్ధమైన పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలు అందిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లండి.
అని హరీశ్ రావు ముగించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
సెప్టెంబర్ 22, 2026

Uttam Kumar Reddy | రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 21, 2026

Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
- ●Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!
- ●Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ●మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!
- ●Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
- ●Delhi Park | పోలీసులమని బెదిరించి.. ఢిల్లీ పార్క్‌లో మైనర్‌పై గ్యాంగ్ రేప్.. 10 రోజుల్లో నాలుగో ఘటన

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..

Parenting | భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందట!.. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే..!

Election Commission | యూపీ, ఉత్తరాఖండ్‌లో 11 రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

మొదట కేటీఆర్.. తర్వాత హరీశ్.. చివరగా కేసీఆర్: రేవంత్ ‘త్రిముఖ’ వ్యూహం!



