BJP MLA | బీజేపీ ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో దాడి.. పీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
BJP MLA | బీజేపీ ఎమ్మెల్యేలు (BJP) కాంగ్రెస్ పార్టీ కార్యాలయ (Congress Office) ముట్టడికి పిలుపునిచ్చారు. మార్గమధ్యంలోని ఆ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం (BJP MLA) పోలీసుల కంటపడకుండా పీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
BJP MLA | త్రినేత్ర.న్యూస్: బీజేపీ ఎమ్మెల్యేలు (BJP) కాంగ్రెస్ పార్టీ కార్యాలయ (Congress Office) ముట్టడికి పిలుపునిచ్చారు. మార్గమధ్యంలోని ఆ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం (BJP MLA) పోలీసుల కంటపడకుండా పీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ఆఫీసు ఎదుట కారు దిగగానే.. అక్కడున్న కార్యకర్తలు ఆయనపై కోడిగుడ్లతో (Eggs) దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష బీజేపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బెంగళూరులోని కేపీసీసీ (KPCC) కార్యాలయానికి వెళ్లి మెమొరాండం సమర్పించి, కరపత్రాలు పంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కేపీసీసీ ఆఫీస్‌కు బయల్దేరారు. అయిఏ మార్గమధ్యంలో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హరిహర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీపీ హరీశ్ (MLA BP Harish) మాత్రం పోలీసుల కళ్లుగప్పి ఒంటరిగా పీసీసీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు (Congress Workers) గుమికూడి ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేను చూసిన వారు ఆగ్రహానికి లోనయ్యారు. ఆయన కారులో నుంచి దిగడంతో కోడిగుడ్లతో దాడిచేశారు. కొన్ని ఆయన తలపై పడ్డాయి. అనుకోకుండా జరిగిన ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆయను భారీ బందోబస్తు మధ్య తమ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన తర్వాత ఇరుపార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు






