Supreme Court | మతం మారితే ఎస్సీ హోదా రద్దు
Supreme Court | ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దయిపోతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. వారికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని స్పష్టం చేసింది.
సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని స్పష్టీకరణ
క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా మతమార్పిడి తర్వాత అట్రాసిటీ వర్తించదని వెల్లడి
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా రద్దయిపోతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. వారికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని స్పష్టం చేసింది. వారికి కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) ఉన్నప్పటికీ, మతమార్పిడి తరువాత అట్రాసిటీ వర్తించదని పేర్కొంది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసే విషయాన్ని విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ తీర్పు వెలువరించింది.
గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్న చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీనిపై ఆనంద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అక్కల రామిరెడ్డితో పాటు ఇతరులపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసును కొట్టివేయాలని రామిరెడ్డి, ఇతరులు ఆంధప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు పిటిషనర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు వర్తించవని తీర్పునిచ్చింది. దీనిపై ఆనంద్ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆనంద్ దశాబ్ద కాలంగా పాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థకు తావులేదని గుర్తు చేసింది. హిందూ, బౌద్ధం, సిక్కు మతాల ప్రజలకు మాత్రమే ఎస్సీ హోదా ఉంటుందని స్పష్టం చేసింది. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ వర్తించదని పేర్కొంది. మతం మారితే కుల ధృవీకరణ పత్రం రద్దు కాకపోయినా అట్రాసిటీ చట్టం మాత్రం వర్తించబోదని తెలిపింది.
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
అక్టోబర్ 4, 2026

One Nation One Election JPC | ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
అక్టోబర్ 1, 2026

Mamata Banerjee | మమత వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ



