త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medical Student | ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

Medical Student | మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో విషాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని (Medical Student) ఆత్మహత్య చేసుకున్న‌ది.

G

Hyderabad | Published On Jul 25, 2026, 12.56 pm IST

Medical Student | ఐదో అంతస్తు నుంచి దూకి.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..
Advertisement

Medical Student | త్రినేత్ర‌.న్యూస్‌: మేడ్చల్ జిల్లా కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో విషాదం చోటు చేసుకుంది. ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని (Medical Student) ఆత్మహత్య చేసుకున్న‌ది. బెంగ‌ళూరులో (Bengaluru) పీజీ చేస్తున్న ఆమె వారం రోజుల క్రిత‌మే ఇంటికి రావడం గ‌మ‌నార్హం.

నాగారంలోని ఈస్ట్ గాంధీన‌గ‌ర్‌కు చెందిన దీక్షిత (26) ఎంబీబీఎస్ పూర్తిచేసి బెంగ‌ళూరులోని సిద్ధార్థ కాలేజీలో పీజీ చేస్తున్న‌ది. గ‌త వారం బెంగ‌ళూరు నుంచి త‌ల్లిదండ్రుల వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అపార్ట్‌మెంట్ ఐదో అంత‌స్తు పైనుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను కుటుంబ స‌భ్యులు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ఆరాతీస్తున్నారు. కాగా, దీక్షిత కుటుంబం సొంతూరు యాదాద్రి జిల్లా (Yadadri Bhuvanagiri) బొమ్మల రామారం మండలం మైలారం గ్రామమని, వారు నాగారంలో స్థిరపడ్డార‌ని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement