Instamart | ఇక స్విగ్గీలోనే ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. నిమిషాల్లోనే డెలివరీ..
Instamart | ఇకపై ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయడం కూడా ఆన్‌లైన్‌లో కిరాణా సామగ్రి ఆర్డర్ చేసినంత సులభంగా మారింది. భారత క్విక్ కామర్స్ రంగంలో తొలిసారిగా ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) భాగస్వామ్యం కుదుర్చుకుని, యాప్ ద్వారా ఎంపిక చేసిన ఎల్పీజీ సిలిండర్లను ఇంటి వద్దకే డెలివరీ చేసే సేవను ప్రారంభించాయి.
Instamart | ఇకపై ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయడం కూడా ఆన్‌లైన్‌లో కిరాణా సామగ్రి ఆర్డర్ చేసినంత సులభంగా మారింది. భారత క్విక్ కామర్స్ రంగంలో తొలిసారిగా ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) భాగస్వామ్యం కుదుర్చుకుని, యాప్ ద్వారా ఎంపిక చేసిన ఎల్పీజీ సిలిండర్లను ఇంటి వద్దకే డెలివరీ చేసే సేవను ప్రారంభించాయి. వంటగ్యాస్‌ను మరింత వేగంగా, సౌకర్యవంతంగా వినియోగదారులకు అందించడమే ఈ సేవ లక్ష్యం. భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ డెలివరీలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ సేవను బెంగళూరులో మాత్రమే ప్రారంభించారు. ఇన్‌స్టామార్ట్ డెలివరీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న అర్హత కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇతర నగరాల్లో ఈ సేవను ఎప్పుడు విస్తరిస్తారనే విషయంపై కంపెనీలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బెంగళూరు వెలుపల ఉన్న వినియోగదారులు మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.
ఏయే సిలిండర్లను ఇస్తారు..
ప్రస్తుతం వినియోగదారులు హెచ్‌పీ నవ్యా 10 కిలోల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్, హెచ్‌పీసీఎల్ 5 కిలోల మెటల్ ఎల్పీజీ సిలిండర్ లను మాత్రమే ఆర్డర్ చేయవచ్చు. సాధారణంగా ఉపయోగించే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ అవసరం లేని వారికి ఈ చిన్న సిలిండర్లు అనుకూలంగా ఉంటాయి. ఇన్‌స్టామార్ట్‌లో ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయడం కూడా ఇతర వస్తువులను ఆర్డర్ చేసినట్లే ఉంటుంది. ముందుగా ఇన్‌స్టామార్ట్ యాప్‌ను ఓపెన్ చేసి, అందుబాటులో ఉన్న హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ సిలిండర్ల కోసం సెర్చ్ చేయాలి. అవసరమైన సిలిండర్‌ను ఎంపిక చేసి, ఆర్డర్ పూర్తి చేసి అవసరమైన వివరాలను నమోదు చేయాలి. బుకింగ్ ప్రక్రియ ఇన్‌స్టామార్ట్ యాప్‌లో పూర్తయినప్పటికీ, సిలిండర్ డెలివరీ మాత్రం హెచ్‌పీసీఎల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్ల ద్వారా, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. దీంతో భద్రతా ప్రమాణాలు పాటించడంతోపాటు అన్ని నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా సేవను అందిస్తారు.
సంబంధిత వార్తలు

Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..
సెప్టెంబర్ 29, 2026

DK Shivakumar | బెంగళూరుకు వచ్చే ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. డీకే సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 26, 2026

Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
- ●Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!
- ●Moody's India Aging Report | ధనిక దేశం కాకముందే వృద్ధ భారత్: వేగంగా పడిపోతున్న జననాల రేటు..!

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..



