త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ITBP | అరుణాచల్ ప్రదేశ్ స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనాతో ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్

ITBP | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో చైనా సైన్యంతో ఘర్షణలు కొనసాగుతున్నట్లు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శ‌త్రుజీత్ క‌పూర్ (Shatrujit Kapoor) అధికారికంగా వెల్ల‌డించారు.

D

National | Published On Oct 23, 2026, 1.05 pm IST

ITBP | అరుణాచల్ ప్రదేశ్ స‌రిహ‌ద్దు వెంబ‌డి చైనాతో ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగుతున్నాయి : ఐటీబీపీ చీఫ్
Advertisement

ITBP | త్రినేత్ర న్యూస్ : అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో చైనా సైన్యంతో ఘర్షణలు కొనసాగుతున్నట్లు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డైరెక్టర్ జనరల్ శ‌త్రుజీత్ క‌పూర్ (Shatrujit Kapoor) అధికారికంగా వెల్ల‌డించారు. గ‌త జులై నుంచి ఈ ఘ‌ర్ష‌ణ‌లు కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు. ITBP సిబ్బంది వార్షిక సన్మాన వేడుకలో ఆయ‌న మాట్లాడుతూ.. "గత కొన్ని రోజులుగా అరుణాచల్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి" అని వెల్లడించారు.

చైనాతో ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్న స‌మ‌యంలో త‌మ బ‌ల‌గాల‌కు చెందిన శౌర్య‌క‌మాండోలు అసాధార‌ణ‌రీతిలో పోరాడుతున్నాయ‌ని ITBP చీఫ్ ప్రశంసించారు. 1962లో ఏర్పాటైన ITBP.. చైనాతో ఉన్న 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖను (LAC) రక్షిస్తోంద‌ని చెప్పారు. "ITBP ఒక పర్వత గెరిల్లా బలగంగా రూపుదిద్దుకుంది. 2004లో మాకు చైనా సరిహద్దు రక్షణ బాధ్యతను అప్పగించారు" అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

చైనా క్లిష్ట‌మైన స‌రిహ‌ద్దు..

చైనా అత్యంత క్లిష్టమైన సరిహద్దు అని అంగీకరించిన శ‌త్రుజీత్ క‌పూర్.. తమ సరిహద్దు యూనిట్లన్నింటిలోనూ డ్రోన్ ప్లాటూన్లను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. గల్వాన్ తరహా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని సిద్ధం చేశామని చెప్పారు. అదేవిధంగా భూగర్భ మౌలిక సదుపాయాలను (underground infrastructure) అభివృద్ధి చేస్తున్నట్లు వివ‌రించారు.

ఘ‌ర్ష‌ణ‌ల‌పై తొలిసారి ప్ర‌క‌ట‌న‌

కాగా, గ‌త కొన్ని నెల‌లుగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త‌లు పెరుగుతున్నాయి. అప్ప‌ర్ సుబ‌న్సిరి జిల్లాలో చైనా క‌వ్వింపు చ‌ర్య‌లు పెరుగుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి తక్సింగ్ ప్రాంతంలోని కీలక పెట్రోలింగ్ స్థావరాల వద్దకు భారతీయ బలగాలను వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుకుంటున్నట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఉద్రిక్త‌త‌ల గురించి ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఈ విష‌య‌మై ఐటీబీపీ డీజీ అధికారికంగా స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్

సరిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవ‌నెత్తింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ విష‌యంలో మౌనం వ‌హిస్తూ.. చైనాకు ప్రణాళికాబద్ధంగా రాయితీలు ఇస్తున్నారని ఆరోపించింది. "స్వయం ప్రకటిత విశ్వగురు చైనాకు ప్రణాళికాబద్ధమైన రాయితీలు ఇస్తూనే ఉన్నారు. అరుణాచల్‌లో పీఎల్‌ఏతో ఇటీవలే జరిగిన ఘర్షణల్లో ఐటీబీపీ పనితీరును డీజీ ప్రశంసించారు. ఇది సరైనదే. కానీ దీనిపై ప్రధాని, ఆయన యంత్రాంగం మాత్రం మౌనం వీడలేదు" అని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జైరాం ర‌మేశ్ వ్యాఖ్యానించారు.

ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు. టాక్సింగ్ ఘర్షణ అనంతరం నియంత్రణ రేఖ (LAC) వెంబడి శాంతిని నెలకొల్పేందుకు సెప్టెంబర్‌లో జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల ఫలితం ఏంటని కేంద్రాన్ని నిల‌దీశారు. "లడఖ్‌లో మాదిరిగానే ఇక్క‌డ‌ కూడా మన పెట్రోలింగ్ పాయింట్ల‌ను కోల్పోయామని స్థానికులు చెబుతున్నారు. చైనా నిరంతరం అరుణాచల్‌లోని మన పట్టణాల పేర్లను మారుస్తూనే ఉంది. అంతేకాకుండా మన పర్యావరణ, జల భద్రతకు ముప్పు కలిగించేలా 60,000 మెగావాట్ల డ్యామ్‌ను నిర్మిస్తోంది" అని జైరామ్ రమేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Also Read..

సీజేపీకి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోం.. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూపుతాం : అన్నామ‌లై

భానుడి భ‌గ‌భ‌గ‌లు.. 50 వేల మంది మృత్యువాత‌.. వాతావరణ మార్పులే కారణమంటున్న ప‌రిశోధ‌కులు

సీనియర్ అధికారిపై ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ఫిర్యాదు.. ప‌ట్టించుకోని కేబినెట్ కార్య‌ద‌ర్శి

Advertisement
Advertisement