Ayodhya | అయోధ్య రామమందిరంలో మారిన సేవలు.. రామ్‌లల్లాకు వేడి పాలు, వెచ్చని దుస్తులు!
Ayodhya | చలికాలం మొదలవడంతో అయోధ్య రామమందిరంలో బాలరాముడి నిత్యసేవల్లో భారీ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల బాలుడి రూపంలో కొలువైన రామ్‌లల్లాను చలి నుంచి కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వేడి నీటితో అభిషేకం, వెచ్చని దుస్తులు, వేడి పదార్థాల నైవేద్యంతో కాలానుగుణంగా సేవలు నిర్వహిస్తున్నారు.
Devotional | Published On Nov 14, 2026, 6.10 am IST
- కుంకుమపువ్వు కలిపిన పాలు నైవేద్యం
- పవళింపు సేవకు గోరువెచ్చని పాలు నివేదన
- కార్తీక పౌర్ణమి నుంచి దుప్పటి కప్పనున్న ఆలయ సిబ్బంది
Ayodhya | చలికాలం మొదలవడంతో అయోధ్య రామమందిరంలో బాలరాముడి నిత్యసేవల్లో భారీ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల బాలుడి రూపంలో కొలువైన రామ్‌లల్లాను చలి నుంచి కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వేడి నీటితో అభిషేకం, వెచ్చని దుస్తులు, వేడి పదార్థాల నైవేద్యంతో కాలానుగుణంగా సేవలు నిర్వహిస్తున్నారు. ఉదయం బాలభోగంలో కుంకుమపువ్వు కలిపిన పాలు, కషాయం సమర్పిస్తుండగా.. రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పాలు అందిస్తున్నారు.
శంఖనాదంతో మేల్కొలుపు..
ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు శంఖనాదంతో రామ్‌లల్లాను మేల్కొలుపుతారు. అనంతరం వేడి నీటితో అభిషేకం చేసి, అలంకరణ చేపడతారు. ఉదయం 6.30 గంటలకు అలంకరణ పూర్తవుతుంది. 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 9 గంటల సమయంలో రబ్డీ, కుంకుమపువ్వు కలిపిన పాలు, కషాయాన్ని బాలభోగంగా సమర్పిస్తారు. మధ్యాహ్నం ఖీర్, పూరీ, కూరగాయలతో నైవేద్యం పెడతారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వేడి పాలు సమర్పించి విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తారు. రామ్‌లల్లా సేవల్లో వేసవి, వర్షాకాలం, చలికాలాన్ని బట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామమందిరం పరిపాలన విభాగం అధిపతి ఇంద్రదేవ్ మిశ్రా తెలిపారు. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే వస్తువులకు ప్రాధాన్యం ఇస్తే.. శీతాకాలంలో వెచ్చని దుస్తులు, వేడి ఆహార పదార్థాలను సమర్పిస్తున్నట్లు వివరించారు. బాలరాముడి రూపానికి అనుగుణంగా చిన్నారిని సంరక్షించినట్లే నిత్యసేవలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
14 మంది ప్రధాన సేవకులతో నిత్యసేవలు..
రామ్‌లల్లా సేవల కోసం ఆలయంలో 14 మంది ప్రధాన సేవకులను నియమించారు. మేల్కొలుపు నుంచి రాత్రి శయనించే వరకు సంప్రదాయబద్ధంగా వీరు సేవలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి నుంచి బాలరాముడికి దుప్పటి కూడా కప్పనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వస్త్రధారణ, నైవేద్యాలు, పూజా విధానాల్లో ఈ ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగనున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kangana Ranaut | గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్ట్.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్
- ●Traffic Restrictions | గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ.. 12 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●IRCTC Tour | ఐదు రోజులు ప్రకృతి ఒడిలో.. చలికాలంలో దండకారణ్య అందాలు చూసొద్దామా..?
- ●Air India | సౌదీ అరేబియాకు సర్వీసులు రద్దు.. మరోసారి పొడిగించిన ఎయిర్ ఇండియా
- ●Flight Shutdown | ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్ క్రాష్.. అమెరికాలో నిలిచిన విమానాలు
- ●Miss Universe | మిస్ యూనివర్స్ పోటీలు.. 15 దేశాల అందెగత్తెలు ఔట్..!

Kangana Ranaut | గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్ట్.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్

Traffic Restrictions | గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ.. 12 గంటల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

IRCTC Tour | ఐదు రోజులు ప్రకృతి ఒడిలో.. చలికాలంలో దండకారణ్య అందాలు చూసొద్దామా..?

Air India | సౌదీ అరేబియాకు సర్వీసులు రద్దు.. మరోసారి పొడిగించిన ఎయిర్ ఇండియా





