త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కొడంగ‌ల్ బిడ్డ‌నంటూ అక్క‌డి ఇండ్ల‌నే కూల్చేస్తవా రేవంత్‌?

Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ బిడ్డనంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిప‌డ్డారు. మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు రేవంత్‌కు ఎవ‌రిచ్చార‌ని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 29, 2026, 4.15 pm IST

Harish Rao | కొడంగ‌ల్ బిడ్డ‌నంటూ అక్క‌డి ఇండ్ల‌నే కూల్చేస్తవా రేవంత్‌?
Advertisement
  • క‌నీసం నోటీసులు కూడా ఇవ్వ‌కుండా ఇంత క‌ర్క‌శ‌త్వ‌మా
  • వారికి వెంట‌నే పున‌రావాసం, ప‌రిహారం ఇవ్వాలి
  • మాజీ మంత్రి హ‌రీశ్ రావు డిమాండ్‌

Harish Rao | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ బిడ్డనంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తున్నార‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిప‌డ్డారు. మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు రేవంత్‌కు ఎవ‌రిచ్చార‌ని ప్ర‌శ్నించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని నిల‌దీశారు. బాధితుల‌కు వెంట‌నే పున‌రావాసం, ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా మండిప‌డ్డారు.

న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా? ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుంచి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? పోలీసులను అడ్డుపెట్టుకుని బుల్డోజర్ రాజ్ అమలు చేస్తారా? పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా మీ ప్రజా పాలన? యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గొప్పగా చెప్పుకునే భూసేకరణ చట్టం-2013 ప్రకారం బాధితులకు తక్షణం న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement