Glacial Lake Outburst | భూటాన్‌లో బద్దలైన గ్లేసియల్ సరస్సు.. భారత్ హై అలర్ట్
Glacial Lake Outburst | భూటాన్‌లో (Bhutan) ఓ గ్లేసియల్ సరస్సు బద్దలైంది. గసా జిల్లాలో ఉన్న షింటాఫు సరస్సు (Shintaphu Lake) అకస్మాత్తుగా ఉప్పొంగింది. వరద ఏ క్షణమైనా ముంచుకొచ్చే ప్రమాదం (Flash Floods Warning ) ఉండటంతో భారత్‌ను భూటాన్ అప్రమత్తం చేసింది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది.
International | Published On Oct 30, 2026, 10.45 am IST
- పశ్చిమ బెంగాల్, అస్సాంలకు వరద హెచ్చరికలు
Glacial Lake Outburst | త్రినేత్ర న్యూస్ : నేపాల్‌లో ఇటీవలే హిమానీనదం (Glacier) విరిగిపడి సంభవించిన ఆకస్మిక వరదలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటన మరవకముందే మరో ప్రమాదం ముంచుకొస్తోంది. భూటాన్‌లో ఓ గ్లేసియల్ సరస్సు బద్దలైంది. భూటాన్ (Bhutan)లోని వాయువ్య గసా జిల్లాలో ఉన్న షింటాఫు సరస్సు (Shintaphu Lake) అకస్మాత్తుగా ఉప్పొంగింది. వరద ఏ క్షణమైనా ముంచుకొచ్చే ప్రమాదం (Flash Floods Warning ) ఉండటంతో భారత్‌ను భూటాన్ అప్రమత్తం చేసింది.
దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. పశ్చిమ బెంగాల్ (West Bengal), అస్సాం (Assam) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. అస్సాంలోని ధుబ్రి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలతో పాటు అలిపుర్దువార్, జల్పాయ్‌గురి జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైన చోట స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గసా జిల్లాలోని మో చు నది (Mo Chhu River) ఒడ్డున ఉన్న ప్రసిద్ధ సహజ వేడి నీటి బుగ్గ గసా త్షాచు (Gasa Tshachu)లోని సదుపాయాలన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి. అయితే, ఆ ప్రాంతాన్ని ముందే ఖాళీ చేయించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. హిమాలయాల్లో ఉన్న 17 అత్యంత ప్రమాదకరమైన హిమానీనద సరస్సుల్లో షింటాఫు సరస్సు ఒకటి. గతంలో ఆగస్టు 26, 2021లో కూడా మో చు నది ప్రవాహం దిశ మార్చుకోవడంతో గసా త్హాచు ప్రాంతం వరద ఉద్ధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వరద నీరు పునాఖా జోంగ్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కబేసా గెవాగ్‌లోని శ్రీగాంగ్‌ను వరదనీరు దాటింది.
సౌర ప్రాజెక్ట్‌పై వరద ప్రభావం
పునాఖాలోని గుమా గెవోగ్ పరిధిలో గల దోచ్చుఖా-జోమ్లింగ్ థాంగ్-రిట్సా చివోగ్‌లో రైతుల సాగునీటి కష్టాలను తీర్చడానికి ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేసిన సోలార్ ఇరిగేషన్ లిఫ్టింగ్ సిస్టమ్.. మో చు నదిలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. నదిలో అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడం వల్ల పంపింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కొన్ని భాగాలు, పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. ఫలితంగా స్థానిక రైతులకు సాగునీటి సరఫరాకు తాత్కాలికంగా ఆటంకం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.
గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (GLOF) అంటే..?
హిమాలయాలు వంటి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల ఈ రకమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. హిమానీనదాలు (గ్లేసియర్స్) కరుగుతూ వెనక్కి తగ్గుతున్నప్పుడు అక్కడ సహజమైన సరస్సులు ఏర్పడతాయి. ఈ సహజ ఆనకట్టలు చాలా బలహీనంగా ఉంటాయి. భూకంపాలు, పెద్ద పెద్ద మంచు చరియలు విరిగిపడటం, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నీటి ఒత్తిడికి సహజసిద్ధంగా ఏర్పడిన ఆనకట్టలు ఒక్కసారిగా తెగిపోతాయి. ఫలితంగా సరస్సులోని లక్షలాది లీటర్ల నీరు, బురద, రాళ్లు, పెద్ద పెద్ద వృక్షాలు ఒక్కసారిగా కిందకు దూసుకొస్తాయి. వీటినే గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ (Glacial Lake Outburst) అంటారు. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పుల (గ్లోబల్ వార్మింగ్) కారణంగా హిమానీనదాలు కరిగిపోవడం వల్ల ఈ సరస్సులు ఏర్పడుతున్నాయి. భారీ స్థాయిలో నీటిని అడ్డుకుంటున్న సహజ ఆనకట్టలు అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల మెరుపు వరదలు సంభవించి విధ్వంసం సృష్టిస్తుంది.
Also Read..
సినిమా కోసం కాలేజీకి సెలవు.. మల్లారెడ్డి వర్సిటీకి ఉన్నత విద్యామండలి నోటీసులు!
ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి..
ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
అక్టోబర్ 29, 2026

CM Suvendu Adhikari | సనాతన ధర్మాన్ని పాటించే వారే అమ్మవారి విగ్రహాలను తాకాలి.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
అక్టోబర్ 21, 2026

West Bengal Voter List Deletion ECI | బెంగాల్లో 5.38 లక్షల ఓట్లు గల్లంతు.. అసలు రహస్యం బయటపడింది!
అక్టోబర్ 17, 2026
తాజావార్తలు
- ●NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..
- ●Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- ●Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..
- ●Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక
- ●Binance Hack | క్రిప్టో చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. 5.8 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీ.. క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం..
- ●TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు

NIMS | అర్ధరాత్రి 2 గంటల వరకు నిమ్స్‌లో ఏసీబీ సోదాలు.. టెండర్ల కేటాయింపులపై ఆరా..

Comrade Kalyan | ఓటీటీలోకి వచ్చేసిన కామ్రేడ్ కళ్యాణ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Israel Elections | నెతన్యాహుకి షాక్.. అతిపెద్ద కూటమిగా అవతరించినా.. మెజార్టీకి దూరంగా..

Chocolate Murder | చాక్లెట్ కోసం గొడవ.. 4 ఏండ్ల బాలుడిని చంపిన బాలిక



