త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్‌.. ఐబీఎం ఆర్డ‌ర్‌తో భారీ లాభాల దిశ‌గా..

Blue Cloud Softech Solutions | బ్లూ క్లౌడ్ సాఫ్‌టెక్ సొల్యూషన్స్ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా దూసుకెళ్లింది. కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థకు ఐబీఎం క్లౌడ్ నుంచి ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలకు భారీ ఆర్డర్ రావడంతో ఈ పెన్నీ స్టాక్‌పై కొనుగోళ్లు పెరిగాయి. బీఎస్‌ఈలో షేరు ధర ఏకంగా 17.20 శాతం ఎగబాకి రూ.23.50 స్థాయిని తాకింది.

S

Business | Published On Sep 25, 2026, 12.36 pm IST

Blue Cloud Softech Solutions | ఒక్క రోజులోనే 17 శాతం పెరిగిన పెన్నీ స్టాక్‌.. ఐబీఎం ఆర్డ‌ర్‌తో భారీ లాభాల దిశ‌గా..
Advertisement

Blue Cloud Softech Solutions | బ్లూ క్లౌడ్ సాఫ్‌టెక్ సొల్యూషన్స్ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా దూసుకెళ్లింది. కంపెనీకి చెందిన అమెరికా అనుబంధ సంస్థకు ఐబీఎం క్లౌడ్ నుంచి ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలకు భారీ ఆర్డర్ రావడంతో ఈ పెన్నీ స్టాక్‌పై కొనుగోళ్లు పెరిగాయి. బీఎస్‌ఈలో షేరు ధర ఏకంగా 17.20 శాతం ఎగబాకి రూ.23.50 స్థాయిని తాకింది. బ్లూ క్లౌడ్‌కు పూర్తిగా చెందిన గ్లోబల్ ఇంపెక్స్‌కు ఐబీఎం క్లౌడ్ నుంచి ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్, డిప్లాయ్‌మెంట్, సపోర్ట్ సేవలకు సంబంధించిన సంతకం చేసిన స్టేట్‌మెంట్ ఆఫ్ వర్క్ అందింది. ఫిక్స్‌డ్-ఫీ ఆర్డర్ విలువ 15.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.147 కోట్లకు సమానం. ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫాం రూపకల్పన, డిప్లాయ్‌మెంట్, కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, సపోర్ట్ వంటి పనులను బ్లూ క్లౌడ్ చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ 24న ప్రారంభమైంది. ఐదు ప్రాజెక్టు ప్రమాణాల ఆధారంగా చెల్లింపులు జరగనున్నాయి.

ఏఐ ప్లాట్‌ఫాం అభివృద్ధి, నిర్వ‌హ‌ణ‌..

ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వినోద్ బాబు బొల్లికొండ మాట్లాడుతూ తమ బృందాలు ఇప్పటికే ప్రాజెక్టు కోసం సిద్ధమయ్యాయని తెలిపారు. స్పష్టమైన మైలురాళ్లు, సేవా ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 99.5 శాతం అందుబాటులో ఉండేలా సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో కూడా క్లయింట్‌తో దీర్ఘకాలిక సంబంధానికి దారితీస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా న్యూజెర్సీలో జీపీయూ ఆధారిత ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫాంను గ్లోబల్ ఇంపెక్స్ నిర్మించి, నిర్వహించనుంది. మోడల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్, ఫైన్‌ట్యూనింగ్, ఇన్‌ఫరెన్స్ వంటి కార్యకలాపాలకు ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించనున్నారు. ఈ పనుల పరిధిలో జీపీయూ కంప్యూట్ క్లస్టర్లు, హై-పర్ఫార్మెన్స్ స్టోరేజ్, నెట్‌వర్కింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు, కుబెర్నెటీస్ ఆధారిత ఆర్కెస్ట్రేషన్, సెక్యూరిటీ, మానిటరింగ్, బ్యాకప్, డిజాస్టర్ రికవరీ వంటి సేవలు ఉన్నాయి. ప్రొడక్షన్ హ్యాండోవర్ అనంతరం స్టెబిలైజేషన్, సపోర్ట్ వ్యవధి కూడా ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది.

ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌కు పెరుగుతున్న డిమాండ్‌..

గ్లోబల్ ఇంపెక్స్ బ్లూ క్లౌడ్ గ్రూప్‌లో చేరిన మూడు నెలల్లోనే ఐబీఎం క్లౌడ్ నుంచి ఈ ఆర్డర్ రావడం విశేషమని కంపెనీ తెలిపింది. ఏఐ ప్రయోగశాలల నుంచి వాస్తవ వినియోగంలోకి వస్తున్న సమయంలో దానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు డిమాండ్ పెరుగుతోందని బ్లూ క్లౌడ్ సాఫ్‌టెక్ సొల్యూషన్స్ గ్రూప్ చైర్మన్ తేజేష్ కుమార్ కొడాలి పేర్కొన్నారు. అమెరికా ప్లాట్‌ఫాం అత్యంత క్లిష్టమైన ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను పొందడంతోపాటు అమలు చేస్తుందని ఈ ఆర్డర్ నిరూపిస్తోందని ఆయన అన్నారు. శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయానికి బ్లూ క్లౌడ్ సాఫ్‌టెక్ సొల్యూషన్స్ షేరు బీఎస్‌ఈలో 14.91 శాతం లాభంతో రూ.23.04 వద్ద ట్రేడవుతోంది.

Advertisement
Advertisement