Ashok Gehlot | ఇందిర బతికుండి ఉంటే బీజేపీని ఎప్పుడో నిషేధించేవారు.. అశోక్ గహ్లోత్ వివాదాస్పద వ్యాఖ్యలు
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.
Ashok Gehlot | రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. తన 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఇంతటి ప్రమాదకర పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. బీజేపీ అభివృద్ధిని పక్కనపెట్టి హిందుత్వ పేరుతోనే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) బతికుండి ఉంటే బీజేపీ లాంటి పార్టీని ఎప్పుడో నిషేధించేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో దేశం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. దేశ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడాన్ని ఈ సందర్భంగా గహ్లోత్ ప్రస్తావించారు. కనీసం కొన్ని స్థానాలైనా కేటాయించి ఉండి ఉంటే దేశానికి వేరే సందేశం వెళ్లేదని అభిప్రాయపడ్డారు.
"దేశ ప్రజలకు చూపించడానికైనా కనీసం ఒక ఐదు సీట్లు అయినా ఇచ్చి ఉండాల్సింది. కానీ మాది కేవలం 'ప్యూర్ హిందుత్వ పార్టీ' అని ప్రొజెక్ట్ చేసుకోవడమే వారి ఉద్దేశం. కేవలం హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలించాలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఇందిరా గాంధీ లాంటి మహోన్నత నాయకులు ఈరోజు బతికి ఉంటే.. బీజేపీ లాంటి పార్టీపై ఎప్పుడో నిషేధం విధించి ఉండేవారు" అని గహ్లోత్ విమర్శించారు. "హిందుత్వ ఎజెండాతోనే మీరు పార్టీని నడుపుతారా..? కేవలం హిందువుల పేరుతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా..?" అంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్‌కు హిందువులు, హిందుత్వం అంటే ద్వేషమని ఆరోపించింది.
Also Read..
సమగ్ర భాగస్వామ్య స్థాయికి భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు : ప్రధాని మోదీ
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం.. బ్రిటన్ ప్రధాని కీలక ప్రకటన
బాల్య వివాహాలపై రాష్ట్రవ్యాప్త పోరు.. తరుణి సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం..
సంబంధిత వార్తలు

Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ
ఆగస్టు 20, 2026

Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
ఆగస్టు 20, 2026

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?
- ●Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ
- ●Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ - వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే
- ●Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి
- ●Telangana Auto Drivers Strike | కమీషన్ల దోపిడీ.. పెరిగిన ధరల భారం
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

MLA Padi Kaushik Reddy | డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇంత నిర్లక్ష్యమా..?

Sajjan Kumar | రెచ్చగొట్టే ప్రసంగాలు, ఒక్కొక్కరికి రూ.100, పోలీసులతో కుమ్మక్కై.. సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక సజ్జన్ పాత్ర ఇదీ

Madhuri Rathod | మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ‘రాయే లచ్చిమి’ సాంగ్ ట్రెండింగ్ - వీరిద్దరు కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే

Tummala Nageshwar Rao | ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయండి



