Child Marriages | బాల్య వివాహాలపై రాష్ట్రవ్యాప్త పోరు.. తరుణి సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం..
Child Marriages | బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా బాలికల సాధికారత కోసం పనిచేస్తున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో సోమవారం మంత్రి సీతక్క సమక్షంలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగాయి.
Child Marriages | బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను అరికట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా బాలికల సాధికారత కోసం పనిచేస్తున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో సోమవారం మంత్రి సీతక్క సమక్షంలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగాయి. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఒఝా, తరుణి ఫౌండర్స్ మమతా రఘువీర్, రఘువీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, బాల్య వివాహం కేవలం ఒక కుటుంబ సమస్య కాదని, అది బాలికల భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన సామాజిక సమస్య అని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే వివాహాలు జరగడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, ఆర్థికంగా స్వావలంబన కోల్పోవడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు ఎదురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాల్య వివాహం–బతుకు ఆగం అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు ఇప్పటికే పలు కార్యక్రమాలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు తరుణి సంస్థ సహకారంతో వాటిని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు విద్య, ఆరోగ్యం, హక్కులు, భద్రతపై స్పష్టమైన అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఈ ఒప్పందం ద్వారా అంగన్‌వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు, సీడీపీవోలు సహా క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా బాల్య వివాహాల దుష్పరిణామాలు, మైనర్ గర్భధారణ ప్రమాదాలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
బాలికల విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. “ప్రతి బాలిక తన కలలను నెరవేర్చుకునే అవకాశం కల్పించడం మన అందరి బాధ్యత. బాల్య వివాహాలకు పూర్తిగా ముగింపు పలికేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసి పనిచేయాలి” అని ఆమె పిలుపునిచ్చారు.
తరుణి సంస్థ ఫౌండర్ మమతా రఘువీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను తగ్గించేందుకు సాంకేతిక సహకారం, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై
- ●Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
- ●iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..
- ●Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం
- ●Telangana 22A Lands | భూయజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దు
- ●Yadagirigutta | యాదగిరిగుట్ట ఆలయ హుండీ ఆదాయం రూ. 3 కోట్లు.. పెద్ద ఎత్తున విదేశీ కానుకలు

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ - భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ - విజయ్ క్యూట్ రిప్లై

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు

iQOO Z11 | ఐక్యూ జడ్11 వచ్చేసింది.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..

Bhatti Vikramarka | కృష్ణా జలాల్లో న్యాయమైన వాటానే కోరుతున్నాం





