Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ – లంగా ఓణీలో కృతిశెట్టి – జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్
కృతిశెట్టి బర్త్‌డే సందర్భంగా జనవరి 12 విడుదల మూవీ టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో లంగా ఓణీ ధరించి ట్రెడిషనల్ లుక్‌లో కృతిశెట్టి కనిపిస్తోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న జనవరి 12 విడుదల మూవీతో రెండేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది కృతిశెట్టి.
Entertainment | Published On Sep 21, 2026, 1.28 pm IST
Krithi Shetty | ఉప్పెన సినిమాతో యువతరం కలలరాణిగా మారిపోయింది కృతిశెట్టి. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో అద్భుత నటనతో అదరగొట్టింది. తొలి సినిమాతోనే పెద్ద విజయాన్ని అందుకున్న కృతిశెట్టికి టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఒకేసారి ఐదారు సినిమాలు అంగీకరించి బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా బేబమ్మ నిలవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ పరాజయాలతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. 2024లో వచ్చిన మనమే తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. ఆఫర్ల కోసం వెయిటింగ్‌లో ఉన్న ఈ బ్యూటీ అనూహ్యంగా అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదలలో ఛాన్స్ దక్కించుకొని టాలీవుడ్ వర్గాలను సర్‌ప్రైజ్ చేసింది.
సంక్రాంతికి థియేటర్లలోకి...
ఈ మల్టీస్టారర్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. కృతి శెట్టితో పాటు కీర్తి సురేష్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
లంగా ఓణీలో...
కృతి శెట్టి బర్త్‌డే సందర్భంగా సోమవారం జనవరి 12 విడుదల మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో లంగా ఓణీలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది. ఈ సినిమాలో దీపికా రెడ్డి అనే రాయలసీమ యువతిగా మాస్ కోణంలో కృతిశెట్టి పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. జనవరి 12 విడుదలలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతిశెట్టి కనిపించబోతుంది. బావబావమరుదుల అనుబంధానికి కామెడీని జోడించి అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. అనిల్ రావిపూడి మూవీతో తెలుగులో కృతిశెట్టి ఫ్లాప్‌ల పరంపరకు పుల్‌స్టాప్ పడటం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.
శంకర్ కొడుకు...
జనవరి 12 విడుదలతో పాటు తమిళంలో డైరెక్టర్ శంకర్ కొడుకు హీరోగా పరిచయం అవుతోన్న ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయికగా కనిపించబోతుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లవర్ బాయ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Toxic OTT | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ – బోల్డ్ సీన్లు కట్!
సెప్టెంబర్ 21, 2026

Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు – పుష్పతో కంపేరిజన్స్ – ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
సెప్టెంబర్ 20, 2026

Keerthy Suresh | నానితో కీర్తి సురేష్ బాక్సాఫీస్ ఫైట్ – ఒక్క రోజు గ్యాప్‌లో మహానటి రెండు సినిమాలు రిలీజ్
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Kasaragod Road Accident | రోడ్డుపై భయానక ప్రమాదం: జీప్‌ను బలంగా ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ ఫుటేజ్
- ●FASTag | ఫాస్టాగ్‌లో కీలక మార్పు.. ట్యాగ్ మార్చకుండానే బ్యాంక్‌ను మార్చుకోవచ్చు..
- ●Jupally Krishna Rao | నీటి సమస్య ఉందన్నది 100 శాతం వాస్తవం
- ●IIT Bombay | విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్
- ●Danam Nagender Supreme Court | సుప్రీంకోర్టుకు దానం నాగేందర్.. బుధవారం అత్యవసర విచారణకు సీజేఐ గ్రీన్ సిగ్నల్
- ●KTR | జూరాల ఆయకట్టు రైతుల అరెస్టు అత్యంత దుర్మార్గం

Kasaragod Road Accident | రోడ్డుపై భయానక ప్రమాదం: జీప్‌ను బలంగా ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ ఫుటేజ్

FASTag | ఫాస్టాగ్‌లో కీలక మార్పు.. ట్యాగ్ మార్చకుండానే బ్యాంక్‌ను మార్చుకోవచ్చు..

Jupally Krishna Rao | నీటి సమస్య ఉందన్నది 100 శాతం వాస్తవం

IIT Bombay | విద్యార్థి మృతితో ఐఐటీ బాంబేలో ఉద్రిక్తత.. ప్రొఫెసర్ సస్పెండ్



