American Couple | భారత్‌లో 30 రోజుల పర్యటన.. రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట
American Couple | అమెరికాకు చెందిన ఓ జంట భారత్‌లో 30 రోజుల పాటూ పర్యటించింది. ఈ పర్యటనలో ఏకంగా రూ.10 లక్షలు ఖర్చుచేసింది. ముఖ్యంగా ట్రావెలింగ్‌కే బోలెడు డబ్బులు అయినట్లు ఆ జంట తెలిపింది. అందులో ఆరు ఫ్లైట్ జర్నీలు, ఆరు ప్రైవేట్ లగ్జరీ కార్ రైడ్స్, రెండు రైలు ప్రయాణాలు ఉన్నట్లు చెప్పింది.
American Couple | అమెరికాకు చెందిన ఓ జంట (American Couple) ఇటీవలే భారత పర్యటనకు వచ్చింది. ఈ సందర్భంగా పలు నగరాల్లో పర్యటించి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. సుమారు నెలరోజుల పాటూ వారు దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను విజిట్ చేసింది. ఈ నెలరోజుల టూర్‌కు తమకు అయిన మొత్తం ఖర్చును ఈ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్ అవుతోంది.
అలెక్స్, అమేలియా జంట భారత్‌లో పర్యటించింది. 30 రోజుల్లో 13 నగరాలను చుట్టేసింది. ఈ పర్యటనలో తాము అనుకున్నదానికంటే ఎక్కువగానే ఖర్చు అయినట్లు ఆ జంట తెలిపింది. లగ్జరీ వసతులు, ప్రీమియం అనుభవాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించింది. ముఖ్యంగా ట్రావెలింగ్‌కే బోలెడు డబ్బులు అయినట్లు తెలిపింది. అందులో ఆరు ఫ్లైట్ జర్నీలు, ఆరు ప్రైవేట్ లగ్జరీ కార్ రైడ్స్, రెండు రైలు ప్రయాణాలు ఉన్నట్లు చెప్పింది.
ఇక ప్రీమియం హోటళ్ల అధిక ధరల వల్ల ఖర్చులు మరింత పెరిగాయని వివరించింది. ఒక రాత్రి బస చేయడానికి సుమారుగా రూ.12,064 (127 డాలర్లు) ఖర్చయిందని ఈ జంట తెలిపింది. ఫుడ్‌కి కూడా బాగానే ఖర్చైనట్లు వివరించింది. మొత్తంగా తమ 30 రోజుల భారత పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చైనట్లు వెల్లడించింది. అంటే రోజుకు సగటున రూ.33 వేలు ($354) అని తెలిపింది. ట్రిప్ పూర్తైన తర్వాత నెల రోజుల్లో భారత్‌లో ఎంత ఖర్చు చేశామో చూసి తాము ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
స్పైస్‌జెట్‌కు జీఎస్టీ శాఖ నోటీసులు.. రూ.124 కోట్లకు పైగా పన్ను డిమాండ్
హాయ్-హలో చెప్పొద్దన్నారు.. కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సంబంధిత వార్తలు

Couple | ఒకే ఇంట్లో ఉంటున్నా.. 20 ఏళ్లుగా మాట్లాడుకోని భార్యాభర్తలు.. కారణం తెలిస్తే షాకే..!
జులై 24, 2026

Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
జులై 11, 2026

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
జులై 6, 2026
తాజావార్తలు
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!



