Couple | ఒకే ఇంట్లో ఉంటున్నా.. 20 ఏళ్లుగా మాట్లాడుకోని భార్యాభర్తలు.. కారణం తెలిస్తే షాకే..!
Couple | జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై అలిగి 20 ఏళ్లుగా మాట్లాడటం లేదంట. భార్య తన పిల్లలపై చూపే శ్రద్ధ పట్ల అసూయపడిన ఆ భర్త ఆమెపై అలిగాడట. అలా దశాబ్దాలుగా మాట్లాడకుండానే ఒకే ఇంట్లో సంసారం సాగించారు. చివరికి పిల్లల చొరవతో ఆ ఆలుమగలు ఒక్కటయ్యారు.
International | Published On Jul 24, 2026, 9.30 am IST
Couple | ఆలుమగల (Couple) మధ్య గొడవలు సహజమే. ఒక్కోసారి చిన్నచిన్న కారణాలతో తగువులాడుతుంటారు. అలగడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కామ్‌గా ఉండిపోవడం చేస్తుంటారు. కొన్నిసార్లు రెండు రోజులు, వారం రోజుల వరకూ మాట్లాడుకోకుండా అయినా ఉంటారు. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే ఓ భర్త తన భార్యపై అలిగి ఏకంగా 20 ఏళ్లు మాట్లాడకుండా ఉన్నాడంట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం.
జపాన్‌ను చెందిన ఒకువో కటామియా, యుమి భార్యా భర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భార్య యుమి తన పిల్లలపై చూపించే శ్రద్ధపట్ల కటామియా అసూయపడేవాడు. అలా భార్యపై అలిగి ఆమెతో మాట్లాడటం మానేశాడు. యుమి మాట్లాడేందుకు ఎంత ప్రయత్నించినా.. కటామియా మాత్రం కేవలం సైగలతోనే సమాధానం ఇచ్చేవాడు. దీంతో ఆమె కూడా మాట్లాడటం మానేసింది. అయినా వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కలిసి భోజనం చేయడం, పిల్లల్ని చూసుకోవడం చేశారు. అలా దాదాపు 20 ఏళ్లు వాళ్లు ఇలానే ఒకరికొకరు మాట్లాడుకోకుండానే సంసారం సాగించారు.
పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లు తల్లిదండ్రులు మాట్లాడుకోవడం చూడనేలేదు. దీంతో వాళ్లని ఎలాగైనా ఒక్కటి చేయాలని చిన్నకుమారుడు సంకల్పించాడు. ఈ క్రమంలో అతను ఏకంగా ఓ టీవీ షోను ఆశ్రయించాడు. తన తల్లిదండ్రులు రెండు దశాబ్దాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నా మాట్లాడుకోవడం లేదని.. వాళ్లని ఎలాగైనా ఒక్కటి చేయాలని కోరాడు. యువకుడి అభ్యర్థన మేరకు సదరు టీవీ షో యాజమాన్యం కటామియా, యుమిని ఏకాంతంగా కలిసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ జంట దశాబ్దాల క్రితం మొదటిసారి డేటింగ్‌కు వెళ్లిన పార్కులోనే ఆ దంపతులు మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేశారు.
పార్క్‌లో ఓ బెంచ్‌పై భార్య, భర్త ఇద్దరూ ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. అక్కడ కొద్ది దూరంలోనే వారి ముగ్గురు పిల్లలూ చాటుగా వీరిని గమనిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కటామియా తన భార్యతో తొలిసారి నోరువిప్పి మాట్లాడాడు. "మనం మాట్లాడుకుని చాలా కాలమైపోయింది. నువ్వు పిల్లల గురించే ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించేదానివి. ఈ విషయంలో నాకు అసూయ కలిగింది. ఇప్పటి వరకూ నువ్వు ఎంతో కష్టాన్ని భరించావు. ఇకపై అలా చేయను" అంటూ తన భార్య యుమితో అన్నాడు. తల్లిదండ్రులు ఒక్కటి కావడంతో ఆ పిల్లల సంతోషానికి అవధులు లేవు. ఈ భావోద్వేగ కలయిక సామాజకి మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
మారిన బీబీనగర్ ఎయిమ్స్ ఓపీడీ రిజిస్ట్రేషన్ సమయాలు.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Wedding | పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ వడ్డించారని.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
జులై 11, 2026

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
జులై 6, 2026

Empire State Building | సినిమా తరహాలో ప్రమాదకర స్టంట్స్.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
జులై 2, 2026
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన



