Kiara Advani | హాయ్-హలో చెప్పొద్దన్నారు.. కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Kiara Advani | రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీ తాజాగా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనకు పెట్టిన ఓ ప్రత్యేక షరతుల గురించి వివరించింది.
Entertainment | Published On May 30, 2026, 4.45 pm IST
Kiara Advani | రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కియారా అద్వానీ తాజాగా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తనకు పెట్టిన ఓ ప్రత్యేక షరతుల గురించి వివరించింది. బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ.. పాత్రలో పూర్తిగా మమేకం కావాలనే ఉద్దేశంతో దర్శకురాలు తనకు ప్రత్యేక సూచనలు ఇచ్చారని చెప్పారు. ‘‘సాధారణంగా నేను షూటింగ్‌కు వెళ్లిన వెంటనే అందరికీ ‘హాయ్’, ‘హలో’, ‘గుడ్ మార్నింగ్’ అంటూ పలకరిస్తుంటాను. నేను అలాంటి వ్యక్తిని. అయితే, ఒక రోజు షూటింగ్‌కు ముందు గీతూ మోహన్‌దాస్ నాతో మాట్లాడారు. ‘రేపు సెట్‌లోకి వచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా నీ పాత్రలోనే ఉండాలి. ఎవరితోనూ హాయ్-హలోలు అవసరం లేదు. నీ టీమ్‌తో కూడా మాట్లాడొద్దు. నేరుగా పాత్ర మూడ్‌లోకి వెళ్లి రోజంతా అదే జోన్‌లో ఉండు’ అని చెప్పారు’’ అని కియారా గుర్తు చేసుకున్నారు.
దర్శకురాలి సూచన మొదట తనకు కాస్త కొత్తగా అనిపించినప్పటికీ.. ఆ విధానం పాత్రలో మరింతగా లీనమయ్యేందుకు సహాయపడిందని తెలిపారు. షూటింగ్ సమయంలో పాత్ర భావోద్వేగాలను కొనసాగించడానికి ఆ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఇక ఈ సినిమా తన కెరీర్‌లో ఒక ప్రత్యేక అనుభవంగా నిలిచిందని కియారా పేర్కొన్నారు. ముఖ్యంగా కన్నడ భాషలో నటించడం తనకు కొత్త సవాల్‌గా మారిందన్నారు. ‘‘కన్నడలో పనిచేయడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. ‘టాక్సిక్’ సినిమా కోసం మేం ఒకే సన్నివేశాన్ని ఇంగ్లిష్, కన్నడ భాషల్లో చిత్రీకరించేవాళ్లం. ముందుగా ఇంగ్లిష్‌లో కావాల్సిన టేక్ పూర్తయ్యే వరకు షూట్ చేసేవాళ్లం. ఆ తర్వాత అదే సన్నివేశాన్ని మళ్లీ కన్నడలో చిత్రీకరించేవాళ్లం’’ అని చెప్పింది. కన్నడ తన మాతృభాష కాకపోవడంతో డైలాగ్‌లు నేర్చుకోవడానికి శ్రమించాల్సి వచ్చిందని కియారా వెల్లడించింది. ‘‘ప్రతి రోజు మరుసటి రోజు షూటింగ్‌కు సంబంధించిన కన్నడ డైలాగ్‌లను ముందురోజు రాత్రే కంఠస్థం చేసుకునేదాన్ని. భాష తెలియకపోయినా సరైన ఉచ్చారణతో చెప్పేందుకు చాలా కష్టపడ్డాను’’ అని చెప్పింది.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్, కియారా అద్వానీతో పాటు నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ‘టాక్సిక్’ చిత్రాన్ని 2026 జూన్ 4న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తొలుత ప్రకటించారు. నిర్మాణ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కారణంగా విడుదలను మరోసారి వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యశ్ అభిమానులు కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




