SpiceJet | స్పైస్‌జెట్‌కు జీఎస్టీ శాఖ నోటీసులు.. రూ.124 కోట్లకు పైగా పన్ను డిమాండ్
SpiceJet | బడ్జెట్ విమానయాన రంగంలో పేరొందిన స్పైస్‌జెట్‌కు షాక్ తగిలింది. నెలల తరబడి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ సంస్థపై రూ.124.65 కోట్ల భారీ డిమాండ్ విధించింది.
SpiceJet | బడ్జెట్ విమానయాన రంగంలో పేరొందిన స్పైస్‌జెట్‌కు షాక్ తగిలింది. నెలల తరబడి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ సంస్థపై రూ.124.65 కోట్ల భారీ డిమాండ్ విధించింది. అంతేకాదు, పన్ను నిబంధనలు వరుసగా ఉల్లంఘించడంతో స్పైస్‌జెట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అధికారుల ప్రకారం.. నిర్దేశిత గడువుల్లో రిటర్నులు సమర్పించకపోవడం, వరుసగా ఆలస్యంగా ఫైలింగ్ చేయడం వంటి కారణాలతో ఈ చర్యలు చేపట్టారు. జీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 62 ప్రకారం ప్రొవిజనల్ అసెస్మెంట్ నిర్వహించి పన్ను బకాయిని ఖరారు చేసినట్లు తెలిపారు.
విభాగాల వారీగా చూస్తే నవంబర్ నెలకు రూ.44.44 కోట్లు, డిసెంబర్‌కు రూ.43.79 కోట్లు, జనవరి రూ.12.19 కోట్లు, ఫిబ్రవరి రూ.12.10 కోట్లు, మార్చి రూ.12.12 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇదిలా ఉండగా, జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు అంశంపై ఈ నెల 25న షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, సంస్థ నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయి అనుసరణ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. “పెండింగ్ రిటర్నులు వెంటనే దాఖలు చేసి నిబంధనలు పాటించకపోతే చట్టప్రకారం తదుపరి చర్యలు తప్పవు” అని ఓ అధికారి పేర్కొన్నారు. ఇక ఆర్థిక పరిస్థితుల పరంగా కూడా స్పైస్‌జెట్ ఒత్తిడిలోనే ఉంది. 2025 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రూ.621 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలు మరింత పెరగడం గమనార్హం. మార్కెట్లో కూడా సంస్థ షేర్లపై ఒత్తిడి కొనసాగుతోంది. బీఎస్ఈలో నిన్నటి ట్రేడింగ్‌లో స్పైస్‌జెట్ షేరు ధర 0.47 శాతం తగ్గి రూ.12.75 వద్ద స్థిరపడింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
మే 30, 2026

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
మే 30, 2026

Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
మే 30, 2026
తాజావార్తలు
- ●Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?
- ●Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన

Kedarnath Mule Viral Video | కేదార్నాథ్ యాత్రలో మూగజీవికి నరకం: 140 కిలోల వ్యక్తి ప్రయాణం.. భక్తి పేరుతో ఇంత క్రూరత్వమా?

Naga Chaitanya Samantha Divorce | సమంత కెరీర్ నాశనం చేశానా? ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగ చైతన్య

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక



