Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
Rejinagar Assembly bypoll | తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో షాక్ తగిలింది. రెజినగర్ అసెంబ్లీ ఉపఎన్నిక బరి నుంచి రబియుల్ ఆలం చౌదరి (Rabiul Alam Chowdhury) తప్పుకున్నారు.
Rejinagar Assembly bypoll | త్రినేత్ర.న్యూస్ : ఉప ఎన్నికల వేళ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మమత వర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ (Sanchita Pradhan De) నందిగ్రామ్ ఉప ఎన్నిక (Nandigram bypoll) బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెజినగర్ అసెంబ్లీ ఉపఎన్నిక బరి నుంచి రబియుల్ ఆలం చౌదరి (Rabiul Alam Chowdhury) తప్పుకున్నారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆలం శనివారం అధికారికంగా ప్రకటించారు.
మమతతో చర్చలు జరిపిన తర్వాతే నామినేషన్‌ను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టీఎంసీ పేరు, గుర్తుపై జరుగుతున్న న్యాయపోరాటం, అలాగే మమతా నేతృత్వంలోని వర్గానికి చెందిన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు. కాగా, అక్టోబర్ 6వ తేదీన నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
మరోవైపు నందిగ్రామ్ ఉప ఎన్నిక నుంచి తమ వర్గానికి చెందిన అభ్యర్థి సంచితా ప్రధాన్ తప్పుకోవడంతో.. ఆ స్థానానికి ఎవరినీ బరిలోకి దించబోమని మమతా ప్రకటించారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు రెజినగర్ విషయంలో మమత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
Also Read..
కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!
రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?
- ●Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!
- ●UPI Payments | కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!
- ●MLC Deshapathi Srinivas | లండన్ "టాక్ చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
- ●Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్సైట్లను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..
- ●NIMS | నిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల ధర్నా విరమణ

Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?

Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!

UPI Payments | కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!

MLC Deshapathi Srinivas | లండన్ "టాక్ చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్






