త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే తెలుగు హార‌ర్ మూవీ – దుష్ట‌శ‌క్తులున్న గుహ‌లో అడుగుపెడితే!

కామాక్షి భాస్క‌ర్ల హీరోయిన్‌గా న‌టించిన తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ఆగ‌ధ థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎంఎస్‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ హార‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి జీ తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Sep 19, 2026, 12.07 pm IST

Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే తెలుగు హార‌ర్ మూవీ – దుష్ట‌శ‌క్తులున్న గుహ‌లో అడుగుపెడితే!
Advertisement

Horror OTT | కామాక్షి భాస్క‌ర్ల హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ అగ‌ధ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజైంది. మిస్టిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కేర‌ళ స్టోరీ 2 ఫేమ్ ఉల్కా గుప్తా తో పాటు శ్ర‌వ‌ణ్ రెడ్డి, జోవిక విజ‌య్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఆగ‌స్ట్ సెకండ్ వీక్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అగ‌ధ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేట‌ర్ల‌లో ప‌ది కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

ఓటీటీలోకి...

తాజాగా అగ‌ధ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి జీ తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. రిలీజ్ డేట్‌ను వెల్ల‌డించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. అగ‌ధ మూవీకి రాకేష్ వెంక‌ట‌పురం, అరుళ్‌దేవ్ మ్యూజిక్ అందించారు.

ర‌హ‌స్య గుహ‌...

ఛ‌త్తీస్‌ఘడ్‌లోని అడ‌వుల్లో ఉన్న గుహ‌లోకి వెళ్లిన‌వారు ఎవ‌రూ తిరిగిరారు. మ‌హిమ త‌ను ప్రేమించిన సింహ, స్నేహితుడు బ‌బ్లూతో క‌లిసి గుహ‌లోకి వెళ‌తారు. ఆ గుహ నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత మ‌హిమ, బ‌బ్లూ చ‌నిపోతారు. సింహ అదృశ్య‌మ‌వుతాడు. ఆ గుహ మిస్ట‌రీని మ‌హాదేవి ఎలా ఛేదించింది? ఆ గుహ‌లో ఉన్న తంత్ర శ‌క్తుల‌తో దేవుడి అండ‌తో మ‌హాదేవి ఎలా పోరాడింది? మ‌హిమ‌తో మ‌హాదేవికి ఉన్న సంబంధ‌మేమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

మా ఊరి పొలిమేర‌...

మా ఊరి పొలిమేర ఫ్రాంచైజ్ మూవీస్‌తో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది కామాక్షి భాస్క‌ర్ల‌, డెకాయిట్‌, షో టైమ్‌, లైలా, ఓం భీమ్ బుష్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది.

 

Advertisement
Advertisement