త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?

Kishan Reddy | ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డ దానంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్ర‌జానీకం స్వాగ‌తిస్తుంద‌న్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తార‌ని కాంగ్రెస్ పార్టీని కేంద్ర మంత్రి నిల‌దీశారు.

S

Telangana | Published On Sep 19, 2026, 12.22 pm IST

Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?
Advertisement

కాంగ్రెస్ పార్టీని నిల‌దీసిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డ దానంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్ర‌జానీకం స్వాగ‌తిస్తుంద‌న్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తార‌ని కాంగ్రెస్ పార్టీని కేంద్ర మంత్రి నిల‌దీశారు. మాదాపూర్‌లోని ద‌స్ప‌ల్లా హోట‌ల్‌లో శ‌నివారం ఉద‌యం కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఉమ్మ‌డి ఏపీలో వైఎస్సార్ పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు. ఆ ప‌రంప‌ర‌ను గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం, ప్ర‌స్తుత రేవంత్ స‌ర్కార్ కొన‌సాగిస్తుంది. రాష్ట్రం ఏర్ప‌డ్డాక కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకున్నారు. క‌నీసం ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా కూడా చేయించ‌లేదు. స‌బితా ఇంద్రారెడ్డికి ఏకంగా మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారని కిష‌న్ రెడ్డి గుర్తు చేశారు.

రాజ్యాంగాన్ని గౌర‌వించే తీర్పు ఇది

దానం నాగేంద‌ర్ అన‌ర్హ‌త పిటిష‌న్‌ను స్పీక‌ర్ కొట్టేశారు. కానీ మేం హైకోర్టుకు వెళ్లాం. పార్టీ ఫిరాయింపులు చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య అని న్యాయ‌స్థానం గుర్తించి, స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి దానం శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసింది. ఇది రాజ్యాంగాన్ని గౌర‌వించే తీర్పు.. తెలంగాణ‌లోని నాలుగు కోట్ల మంది స్వాగ‌తం ప‌లికారని కిష‌న్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు తేడా లేదు

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికార దాహంతో పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఏ విష‌యంలో కూడా తేడా లేదు.. అది కేసీఆర్ కుటుంబం.. ఇది నెహ్రూ కుటుంబం.. రెండు కూడా కుటుంబ పార్టీలే. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ చట్టాల‌కు తూట్లు పొడిచే పార్టీలు ఇవి. అవినీతిని ప్రోత్స‌హిస్తూ తెలంగాణ సంప‌ద‌ను దోచుకుంటున్న పార్టీల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌లో 1500 ఎక‌రాల్లో వాయుసేన బేస్

ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై సీఎం, కేంద్రమంత్రులతో అనేక సార్లు చర్చలు జరిపాం. 1,500 ఎకరాల్లో ఆదిలాబాద్‌లో వాయుసేన బేస్‌ ఏర్పాటు చేస్తాం. ఎయిర్‌పోర్టు, ఎయిర్‌ఫోర్స్ బేస్‌ కోసం రక్షణ శాఖ ఎక్కువ శాతం ఖర్చు చేయబోతోంది. రాష్ట్రప్రభుత్వం నోడల్ ఆఫీసర్‌ను త్వరలోనే నియమించాలని సూచించారు. ప్రధాని మోదీతో ఎయిర్‌పోర్టు శంకుస్థాపన చేయిస్తామని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు.

 

Advertisement
Advertisement