త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్‌సైట్ల‌ను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..

Gemini | గూగుల్‌కు చెందిన జెమిని ఏఐ మోడల్ సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలను పరీక్షిస్తున్న సమయంలో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసి, ఇతర సంస్థలకు చెందిన మూడు వెబ్‌సైట్లలోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. ఒక ఏఐ వ్యవస్థ స్వయంప్రతిపత్తితో ఇలాంటి చర్యకు పాల్పడినట్లు నమోదైన తొలి ఘటనగా ఇది నిలిచింది.

S

Business | Published On Sep 19, 2026, 11.39 am IST

Gemini | ఏఐతో పెను ముప్పు..? వెబ్‌సైట్ల‌ను హ్యాక్ చేసిన గూగుల్ జెమిని..
Advertisement

Gemini | గూగుల్‌కు చెందిన జెమిని ఏఐ మోడల్ సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలను పరీక్షిస్తున్న సమయంలో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసి, ఇతర సంస్థలకు చెందిన మూడు వెబ్‌సైట్లలోకి ప్రవేశించినట్లు వెల్లడైంది. ఒక ఏఐ వ్యవస్థ స్వయంప్రతిపత్తితో ఇలాంటి చర్యకు పాల్పడినట్లు నమోదైన తొలి ఘటనగా ఇది నిలిచింది. ఈ ఘటన మే నెలలో సైబర్‌ సెక్యూరిటీ పరీక్షలు నిర్వహించే స్వతంత్ర సంస్థ ఇర్రెగ్యులర్ చేపట్టిన పరీక్షలో చోటుచేసుకుంది. సాధారణ భద్రతా పరీక్షలో భాగంగా జెమిని ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించి, పరీక్ష పరిధిలో ఉన్నాయని భావించిన మూడు వెబ్‌సైట్లకు సంబంధించిన ఆధారాలను ఊహించి వాటిలోకి ప్రవేశించినట్లు గూగుల్‌ సెక్యూరిటీ ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్ తెలిపారు. ఈ మూడు సంస్థలకు జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు, అలాగే తమ శిక్షణ భాగస్వామితో కలిసి పరీక్షా విధానాల్లో అవసరమైన మార్పులు చేయించినట్లు పేర్కొన్నారు. శక్తివంతమైన ఏఐ మోడళ్లకు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అన్నారు.

పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఊహిస్తూ హ్యాకింగ్‌..

ఇర్రెగ్యులర్ ప్రతినిధి తెలిపిన ప్రకారం ఈ ఘటన ఇతర ఏఐ సంస్థల్లోనూ కనిపించిన సమస్యకు సంబంధించినదే. సంబంధిత ఏఐ సంస్థలన్నింటికీ జూలై చివర్లో సమాచారం అందించినట్లు తెలిపారు. తమ వైపు గుర్తించిన అన్ని సమస్యలను పరిష్కరించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలే మెటా, ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ వ్యవస్థలకు సంబంధించిన పరీక్షల్లోనూ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆగస్టులో మెటా వెల్లడించిన ఘటనలో శాండ్‌బాక్స్‌ నుంచి బయటపడడం లేదా అత్యంత క్లిష్టమైన సైబర్‌ దాడి జరగలేదని పేర్కొంది. ఏఐ సైబర్‌ సెక్యూరిటీ పరీక్షలను సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్తమ విధానాలపై పనిచేస్తున్నట్లు ఇర్రెగ్యులర్ తెలిపింది. వాల్‌స్ట్రీట్ జర్నల్‌ తొలుత వెల్లడించిన వివరాల ప్రకారం, మూడు ఘటనల్లో ఒకదానిలో జెమిని పాస్‌వర్డ్‌లను వరుసగా ఊహిస్తూ చివరకు రక్షిత వ్యవస్థలోకి ప్రవేశించింది. మరో రెండు ఘటనల్లో బహిరంగంగా అందుబాటులో ఉన్న రిపాజిటరీలోని ఆధారాలను గుర్తించి, వాటి సహాయంతో రక్షిత వ్యవస్థల్లోకి ప్రవేశించింది. అయితే ఈ మూడు సందర్భాల్లోనూ జెమిని తన హ్యాకింగ్‌ చర్యలను తానే నిలిపివేసిందని గూగుల్ తెలిపింది.

ఏఐ ఏజెంట్లు ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ వ్యవస్థలను నేరుగా యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వాటిపై అమలు చేయాల్సిన భద్రతా నియంత్రణలపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పరీక్షల కోసం ఇచ్చిన పరిమితులను ఏఐ మోడల్ ఎలా అర్థం చేసుకుంటుంది, బహిరంగంగా లభించే సమాచారాన్ని ఉపయోగించి రక్షిత వ్యవస్థలను చేరుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని ఎలా అడ్డుకోవాలి అనే అంశాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement
Advertisement