TMC Office | కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ
TMC Office | కోల్‌కతా (Kolkata)లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఆఫీస్‌లోకి చొరబడ్డ కొందరు వ్యక్తులు.. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఫ్లాట్-స్క్రీన్ మానిటర్లను ఎత్తికెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇది బీజేపీ గూండాల పనే అని ఆరోపించారు.
TMC Office | త్రినేత్ర.న్యూస్ : కోల్‌కతా (Kolkata)లోని తమ పార్టీ కార్యాలయం (TMC Office)పై దాడి జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఇవాళ తెల్లవారుజామున కొందరు వ్యక్తులు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. దాదాపు రెండు గంటల పాటు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అత్యంత దారుణం అని పేర్కొంది.
ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన కొందరు వ్యక్తులు కోల్‌కతా నడిబొడ్డున కామాక్ స్ట్రీట్‌లోని (Camac Street) తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి, ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఫ్లాట్-స్క్రీన్ మానిటర్లను ఎత్తికెళ్లినట్లు పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. వారి ఫోన్లను కూడా లాక్కున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫర్నిచర్, కార్యాలయ పరిసరాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను ధ్వంసం చేశారని చెప్పారు. ఇది బీజేపీ గూండాల పనే అని ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. అసలు కోల్‌కతాలో పోలీసులు ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. మా సిబ్బంది, లాయర్లు పదేపదే కాల్స్, ఈమెయిల్స్ చేసినప్పటికీ దాదాపు రెండు గంటల పాటు పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అభిషేక్ బెనర్జీ డిమాండ్ చేశారు.
What happened at Camac Street this morning is a disgraceful assault on the rule of law.
At around 4.30 am, BJP hooligans, armed with weapons, stormed our party office in the heart of Kolkata. They attacked our people, snatched their phones, smashed furniture, ransacked the… pic.twitter.com/J3LrSsmKJI
— Abhishek Banerjee (@abhishekaitc) September 3, 2026
Also Read..
24 రోజులైంది.. చర్యలేవి..? వేదిక శుద్ధీకరణపై నడ్డాకు ఖర్గే లేఖ
ఎయిర్‌ఫోర్స్‌కు బాలాకోట్ దాడుల హీరో అభినందన్ వీడ్కోలు.. ప్రైవేట్ పైలట్‌గా కొత్త జర్నీ
పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘవ్ చద్ధా పేరు మాయం.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు
సంబంధిత వార్తలు

Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
సెప్టెంబర్ 5, 2026

BJP MLA | సీపీఎం విమర్శలను తిప్పికొట్టకుండా.. రీల్స్, సెల్ఫ్ ప్రమోషన్లో బిజీ.. .. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు
సెప్టెంబర్ 2, 2026

Mamata Banerjee | కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదు
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే
- ●Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయతలతోనే అవార్డులు ఇస్తున్నాం
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే



