త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI Payments | కొత్త ఛార్జీల మోత‌.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!

UPI Payments | మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌హా దేశంలోని ప‌లు ప్రాంతాల పెట్రోల్ బంకు (Fuel Pumps) డీల‌ర్లు రూ.2 వేలకు మించిన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమని స్ప‌ష్టం చేస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ను పూర్తిగా రద్దు చేయాలని డీలర్లు కోరుతున్నారు.

D

National | Published On Sep 19, 2026, 11.58 am IST

UPI Payments | కొత్త ఛార్జీల మోత‌.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!
Advertisement

UPI Payments | త్రినేత్ర‌.న్యూస్ : యూపీఐ (UPI) లావాదేవీలపై (UPI Payments) ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంశంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్రం నిర్ణ‌యంపై వ్యాపార వ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌హా దేశంలోని ప‌లు ప్రాంతాల పెట్రోల్ బంకు (Fuel Pumps) డీల‌ర్లు రూ.2 వేలకు మించిన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులు స్వీకరించబోమని స్ప‌ష్టం చేస్తున్నాయి.

అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలు దాటిన యూపీఐ చెల్లింపుల (P2M)పై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని కేంద్రం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే పెట్రోల్ బంకుల్లో యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ను పూర్తిగా రద్దు చేయాలని డీలర్లు కోరుతున్నారు. లేనిప‌క్షంలో పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇంధన డీలర్లకు ఇస్తున్న కమీషన్లలో ఎలాంటి మార్పు లేకపోవడం, మరోవైపు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా అదనపు లావాదేవీల ఛార్జీలను భరించడం తమకు కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. మ‌రోవైపు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ నుంచి (MDR on UPI fuel payments) పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరింది.

యూపీఐ పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమలుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన సర్క్యులర్ అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ (UPI) లావాదేవీలపై 0.4% ఎండీఆర్ (MDR) ఫీజు విధిస్తారు. ఈ ఛార్జీని కేవలం వ్యాపారులు (మర్చంట్స్) మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు స‌హా వ్యాపార వ‌ర్గాలు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి.

Also Read..

ర‌ష్యా ఆంక్ష‌ల బిల్లుపై ట్రంప్ సంత‌కం.. ఇక భార‌త్‌పై 100% టారిఫ్స్‌..!

ప‌రీక్ష‌లో చాట్‌జీపీటీ వాడుతూ అడ్డంగా దొరికిపోయి.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

మ‌హిళ‌ను ఈడ్చుకెళ్లింది రైల్వే పోలీసు కాదు.. హోం గార్డ్

Advertisement
Advertisement