త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NIMS | నిమ్స్ రెసిడెంట్ డాక్ట‌ర్ల‌ ధర్నా విర‌మ‌ణ‌

NIMS | నిమ్స్ రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్(RDA), ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మ‌ధ్య చ‌ర్చ‌లు ఫ‌లించాయి. త‌మ భ‌ద్ర‌త‌కు హామీ ఇచ్చిన నేప‌థ్యంలో ధ‌ర్నాను విర‌మిస్తున్న‌ట్లు రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ శ‌నివారం ఉద‌యం ప్ర‌క‌టించింది.

S

Hyderabad | Published On Sep 19, 2026, 11.23 am IST

NIMS | నిమ్స్ రెసిడెంట్ డాక్ట‌ర్ల‌ ధర్నా విర‌మ‌ణ‌
Advertisement

NIMS | త్రినేత్ర‌.న్యూస్ : నిమ్స్ రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్(RDA), ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మ‌ధ్య చ‌ర్చ‌లు ఫ‌లించాయి. త‌మ భ‌ద్ర‌త‌కు హామీ ఇచ్చిన నేప‌థ్యంలో ధ‌ర్నాను విర‌మిస్తున్న‌ట్లు రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ శ‌నివారం ఉద‌యం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఔట్ పేషెంట్, ఎలెక్టివ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ సేవ‌లు య‌ధావిధిగా పునఃప్రారంభ‌మ‌య్యాయి.

ఇటీవ‌ల ఓ రోగి న‌రాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ నిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. అయితే రోగిని ప‌రీక్షిస్తున్న స‌మ‌యంలో అత‌ని బంధువు ఒక‌రు.. జూనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ.. చంపేస్తానంటూ బెదిరింపుల‌కు దిగాడు. ఈ క్ర‌మంలో త‌మ‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ రెసిడెంట్ డాక్ట‌ర్లు ధ‌ర్నాకు దిగారు. దీంతో శుక్ర‌వారం సేవ‌లు నిలిచిపోయాయి.

ఈ క్ర‌మంలో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం రెసిడెంట్ డాక్ట‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. అత్యుత్త‌మైన భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని యాజ‌మాన్యం హామీ ఇవ్వ‌డంతో డాక్ట‌ర్లు ధ‌ర్నా విర‌మించారు. మొత్తానికి భ‌ద్ర‌త‌కు సంబంధించి ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌లు ప‌టిష్టంగా తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు.

Advertisement
Advertisement