త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భ‌ళా

Delhi Trade Fair | ఢిల్లీలో నిర్వ‌హిస్తున్న వాణిజ్య మేళా (Trade Fair)లో తెలంగాణ ఉత్ప‌త్తుల‌ (Telangana Products)కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సంప్ర‌దాయ ఉత్ప‌త్తుల‌న్నీ ఒకేచోట క‌నిపిస్తుండ‌గా సంద‌ర్శ‌కులు విశేష ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

S

Telangana | Published On Nov 21, 2026, 5.49 pm IST

Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భ‌ళా
Advertisement
  • సంప్ర‌దాయ ఆహార ఉత్ప‌త్తుల‌పై సంద‌ర్శ‌కుల ఆస‌క్తి
  • స్టాండీల‌పై ఫ్యూచ‌ర్ సిటీ స‌ద‌స్సు వివ‌రాల ప్ర‌ద‌ర్శ‌న‌
  • పెట్టుబడి సదస్సు వివరాలు, నమోదు కోసం పవిలియన్‌లో స్టాండీలు

Delhi Trade Fair త్రినేత్ర న్యూస్: ఢిల్లీలో నిర్వ‌హిస్తున్న వాణిజ్య మేళా (Trade Fair)లో తెలంగాణ ఉత్ప‌త్తుల‌ (Telangana Products)కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సంప్ర‌దాయ ఉత్ప‌త్తుల‌న్నీ ఒకేచోట క‌నిపిస్తుండ‌గా సంద‌ర్శ‌కులు విశేష ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్‌ నుంచి దేవరకొండ గిరిజన ఆభరణాల వరకు.. హైదరాబాద్‌ ముత్యాల నుంచి ఇప్పపూల లడ్డూల వరకు.. భారత్‌ మండపంలో జరుగుతున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా (ఐఐటీఎఫ్‌)లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. డిసెంబరు 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరిగే సదస్సు వివరాలను స్టాండీల‌పై ఉంచారు.

చేతితో చేసిన అగ‌రుబ‌త్తులు..

గద్వాల, నారాయణపేట చీరలు, వరంగల్‌ చేనేత తివాచీలు, కలంకారీ ఉత్పత్తులు, హైదరాబాద్‌ లక్క గాజులు పెవిలియన్‌లో ఉన్నాయి. సంప్రదాయ ఇక్కత్‌ వస్త్రాలతో ఆధునిక శైలిలో తయారు చేసిన బ్యాగులతో పాటు రాష్ట్రంలోని చిన్న పరిశ్రమల ఉత్పత్తులనూ ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఎంపిక చేసిన స్టాళ్లలో గిరిజన సంప్రదాయ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పపూల (మహువా) లడ్డూలు, చిరుధాన్యాల బిస్కెట్లు, ఇతర చిరుధాన్యాల చిరుతిళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో చేతితో తయారు చేసిన సేంద్రియ అగరుబత్తులనూ మేళాకు తీసుకొచ్చారు.

కొనుగోలుదారులను నేరుగా కలిసే అవకాశం

భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) ఏటా నిర్వహించే ఈ మేళా దేశంలోని ప్రధాన వాణిజ్య ప్రదర్శనల్లో ఒకటి. ‘వికాస్‌ ఔర్‌ విరాసత్‌’ (అభివృద్ధి, వారసత్వం) ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది మేళాలో 11 దేశాల భాగస్వామ్యం ఉంది. 3,500 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారు. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసే చేనేత కార్మికులకు, స్వయం సహాయక సంఘాలకు ఇతర ప్రాంతాల కొనుగోలుదారులను నేరుగా కలుసుకుని, కొత్త మార్కెట్లను అన్వేషించే అవకాశం ఈ మేళాతో లభిస్తోంది. ప్రదర్శన నవంబరు 27 వరకు కొనసాగుతుంది.

శ్రీ‌ధ‌ర్‌బాబు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం చేతివృత్తుల కళాకారులు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు స్టాళ్లు కేటాయించింది. తెలంగాణ పావిలియన్‌ నోడల్‌ అధికారి, వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం ఉప సంచాలకుడు సుధిన్‌ పాల్‌ ఏర్పాట్లను, రోజువారీ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

క్యూఆర్‌ కోడ్‌తో నమోదు

పవిలియన్‌లో ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’ సమాచార, నమోదు స్టాండీలు కూడా సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు స్టాండీపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు.

Advertisement
Advertisement