Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగల సాయన్న
Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు పండుగల సాయన్న అని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
- అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాటం
- మత్స్యకారుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలి
- సాయన్న విగ్రహావిష్కరణలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు
Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు పండుగల సాయన్న అని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో పండుగల సాయన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు.
తరతరాలకు స్ఫూర్తి సాయన్న పోరాటం
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మత్స్యకార సోదరసోదరీమణులకు, ముదిరాజ్ బంధుమిత్రులకు అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సాయన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పేదల అభ్యున్నతికి, మత్స్యకారుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు, గౌరవం, అభివృద్ధి కోసం సాయన్న చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. పేదలకు అండగా నిలిచి, వారి కష్టాలను తీర్చేందుకు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. పండుగల సాయన్నతో పాటు చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న గౌడ్, కొమురం భీమ్ వంటి ప్రజానాయకుల సేవలు, పోరాటాలను పాఠ్యాంశాలు, సాహిత్యం, సినిమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముదిరాజ్‌లతో పాటు అన్ని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విద్య, ఆర్థిక ప్రగతి, ఐక్యత కీలకమని చెప్పారు. ప్రతి కుటుంబం పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇతర వర్గాలతో ఘర్షణ పడకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించాలని కోరారు.

మత్స్యకారులకు ప్రాసెసింగ్ యూనిట్
మత్స్యకారుల జీవనోపాధి, ఆదాయం పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి శ్రీహరి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మత్స్యకార కుటుంబాలకు ఉపయోగపడేలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార కుటుంబాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. బీసీ కేటగిరీ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ప్రస్తుతం బీసీ-ఏలో ఉన్న వర్గాలకు ఇబ్బంది కలగకుండా ముదిరాజ్ పిల్లలకు తగిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీ-జీ కేటగిరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సాయన్న విగ్రహం
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి గౌరవప్రదమైన జీవనం కోసం పండుగల సాయన్న పోరాడారని అన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పేదల పక్షాన నిలిచిన ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ విగ్రహం కేవలం ప్రతిమ మాత్రమే కాదని, పేదల ఆత్మగౌరవానికి, హక్కుల కోసం సాగిన పోరాటానికి ప్రతీక అని అన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, పండుగల సాయన్న వంటి మహనీయుల ఆశయాలను ఆచరిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ సమాజం ఎన్నో ఏళ్లుగా చేసిన కృషి, ఎదుర్కొన్న అడ్డంకుల అనంతరం సాధించిన పురోగతి అభినందనీయమన్నారు. ముదిరాజ్‌లతో పాటు మత్స్యకార వృత్తిపై ఆధారపడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బీసీ వర్గీకరణపై వస్తున్న అభ్యర్థనలను న్యాయబద్ధంగా పరిశీలించి, విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తామని చెప్పారు.

చేపలకు మెరుగైన ధర వచ్చేలా చర్యలు
చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు చేపల పెంపకంతో పాటు కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని జూపల్లి అన్నారు. ఈ సదుపాయాలతో చేపలకు మెరుగైన ధర లభించడంతో పాటు మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మత్స్య రంగ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. 'మన నిజమైన ఆస్తి మన పిల్లలు.. వారి ఆస్తి చదువు' అని పేర్కొంటూ ప్రతి కుటుంబం పిల్లల విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పండుగల సాయన్న ఆశయాలకు అనుగుణంగా పేదల కష్టాల్లో భాగస్వాములై, గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ సోదరులకు, మత్స్యకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులకు మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, బిత్తిరి సత్తి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mega Job Mela | నవంబర్ 25న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భళా
- ●Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!
- ●Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
- ●Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ
- ●Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం

Mega Job Mela | నవంబర్ 25న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భళా

Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!

Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్




