Startup Challenge | 20 రోజుల్లోనే 1,000 స్టార్టప్ ప్రతిపాదనలు!
Startup Challenge | సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (టీఐఎస్‌సీ)కు విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన 20 రోజుల్లోనే వెయ్యికి పైగా స్టార్టప్ ప్రతిపాదనలు (పిచ్ డెక్స్) అందాయి.
- ప్రభుత్వ సమస్యలకు పరిష్కారాల అన్వేషణకు విశేష స్పందన
- 18 అంశాలపై వినూత్న ఆవిష్కరణలకు ఆహ్వానం
- టెక్నాలజీకి సర్కార్ అండ.. పైలట్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు అవకాశం
Startup Challenge | సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (టీఐఎస్‌సీ)కు విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన 20 రోజుల్లోనే వెయ్యికి పైగా స్టార్టప్ ప్రతిపాదనలు (పిచ్ డెక్స్) అందాయి. ప్రభుత్వ శాఖలు ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించేందుకు స్టార్టప్‌లు, పరిశోధకులు, ఆవిష్కర్తలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026కు ముందు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
18 సమస్యలకు పరిష్కారాల అన్వేషణ
ఇంధన, పాఠశాల విద్య, వ్యవసాయం, రెవెన్యూ, రోడ్లు-భవనాలు, సంక్షేమం, వైద్యం తదితర శాఖలకు సంబంధించిన 18 సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. వీటికి సాంకేతిక పరిష్కారాలు రూపొందించాలని స్టార్టప్‌లు, పరిశోధకులను ఆహ్వానించింది. వ్యవసాయానికి సౌరశక్తితో పనిచేసే సాగునీటి పరిష్కారాలు, విద్యార్థుల తెలుగు పఠన సామర్థ్యాన్ని అంచనా వేసే ఏఐ ఆధారిత విధానాలు, చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, గుంతల సమస్యకు శాశ్వత పరిష్కారాలు, సూదులు లేకుండానే రక్తహీనతను గుర్తించే విధానాల అభివృద్ధి వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అందిన ప్రతిపాదనలను సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి పరిశీలించి, అర్హత కలిగిన పరిష్కారాలను ధ్రువీకరించనున్నారు. అత్యంత సమర్థవంతమైనవిగా గుర్తించిన ఆవిష్కరణలను తొలుత పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశం ఉంది. వాటి పనితీరు సంతృప్తికరంగా ఉంటే తదుపరి ప్రభుత్వ కాంట్రాక్టులకూ పరిశీలించనున్నారు.
పైలట్ ప్రాజెక్టు కాకుండా..
ప్రభుత్వమే ఒక స్టార్టప్ పరిష్కారాన్ని తొలుత వినియోగిస్తే ఆ సంస్థకు కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమే కాకుండా మరింత ప్రయోజనం చేకూరుతుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. క్షేత్రస్థాయిలో తమ సాంకేతికత పనిచేస్తుందనే నిరూపణ లభించడంతో పాటు పెట్టుబడిదారుల వద్ద విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొన్నారు. 20 రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రతిపాదనలు రావడం ప్రభుత్వ సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు ఆవిష్కర్తలు ఆసక్తి చూపుతున్నారనడానికి నిదర్శనమన్నారు. కేవలం దరఖాస్తులు స్వీకరించడమే ఈ కార్యక్రమం లక్ష్యం కాదని, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను గుర్తించి, వాటిని విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం, స్టార్టప్ రంగం మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టీఐఎస్‌సీని చేపట్టింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mega Job Mela | నవంబర్ 25న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా
- ●Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగల సాయన్న
- ●Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భళా
- ●Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!
- ●Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
- ●Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ

Mega Job Mela | నవంబర్ 25న హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

Pandagala Sayanna | పేదల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగల సాయన్న

Delhi Trade Fair | ఢిల్లీ వాణిజ్య మేళా.. తెలంగాణ ఉత్పత్తులకు ఆదరణ భళా

Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!



