PM Modi | ఆలోచనల్లోని హద్దులను చెరిపేస్తేనే దేశం అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుంది : ప్రధాని మోదీ
PM Modi | "పరిమితులను అధిగమించి, అవకాశాలను సృష్టించుకోవాలి" (Break the limits, unlock the possibilities) అనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
PM Modi | త్రినేత్ర న్యూస్ : ఆలోచనా విధానంలోని అడ్డంకులను తొలగించుకున్నప్పుడే ఏ దేశమైనా తన అసలైన సామర్థ్యాన్ని గుర్తిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ సరిగ్గా అదే చేసి చూపించిందని చెప్పారు. "పరిమితులను అధిగమించి, అవకాశాలను సృష్టించుకోవాలి" (Break the limits, unlock the possibilities) అనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గత 12 ఏళ్లలో దేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు. గతంలో ఎర్రకోటపై నుంచి కేవలం పేదరిక నిర్మూలన గురించి నినాదాలు ఇచ్చి ఫైళ్లు తయారు చేయడం మాత్రమే జరిగేదని ప్రధాని తెలిపారు. కానీ గత 12 ఏళ్లలో తమ ప్రభుత్వం పేదలకు సాధికారత కల్పించేలా విధానాలను మార్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ.. గత 12–13 ఏళ్లలో దేశంలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.
ఎడ్లబండ్ల స్థాయి నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, ఉత్తరాల నుంచి సోషల్ మీడియా సందేశాల వరకు నేడు భారత్ ఎంతో పరివర్తన చెందిందని మోదీ వివరించారు. సెమీకండక్టర్ మిషన్ వంటి రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతిలో ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని అభినందించారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నో ఆలోచనలకు బలం చేకూరిన నేల అని, జాతీయ ఉద్యమాలకు రూపం ఇచ్చిన గడ్డ అని ప్రధాని కొనియాడారు. ఒకప్పుడు స్వాతంత్య్ర సమరయోధుల కోసం నిర్బంధ శిబిరం ఉన్న స్థలంలోనే నేడు ఐఐటీ ఖరగ్‌పూర్ కొలువుదీరిందని గుర్తు చేశారు. ఆనాటి సమరయోధుల జీవితాలు, ఆలోచనలు, త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిందని చెప్పారు. భారత్ 'వికసిత్ భారత్' లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో.. దేశ అభివృద్ధి, ఆవిష్కరణల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల అనుభవం కీలక పాత్ర పోషిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, పరిశోధన, సాంకేతిక పురోగతి రంగాల్లో ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ అందిస్తున్న సహకారం భారతదేశ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంతో ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని చెప్పిన ప్రధాని.. విద్యార్థులు 'నేషన్ ఫస్ట్' అనే మంత్రంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Also Read..
విదేశీ పౌరురాలై ఉండి.. మారుతీ ఎండీ ఎలా అయ్యారు.. సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నరు
రామాయణంలోని మరో కోణం - లక్ష్మణుడి కథతో సినిమా - షూటింగ్ మొత్తం ఏఐతోనే...
సంబంధిత వార్తలు

Kiren Rijiju | 1962 నాటి అవమానానికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? : రాహుల్పై కేంద్ర మంత్రి ఫైర్
నవంబర్ 21, 2026

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026

Rahul Gandhi | రాజీపడిన ప్రధాని ఎప్పటికీ అక్కడ కూర్చోలేరు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!
- ●ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- ●Harish Rao | రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నరు
- ●Ramayana | రామాయణంలోని మరో కోణం - లక్ష్మణుడి కథతో సినిమా - షూటింగ్ మొత్తం ఏఐతోనే...
- ●Life Insurance | రూ.1 కోటి బీమా తీసుకున్నాక వ్యక్తి మృతి.. చెల్లింపునకు సంస్థ నిరాకరణ.. తరువాత ఏమైంది..?
- ●Mahesh Kumar Goud | బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు

Indian Railways | రైలు సీట్లు, బెర్తులు ఎక్కువగా బ్లూ కలర్లోనే ఎందుకుంటయ్..? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

ACB Trap | వితంతు పింఛన్ మంజూరుకు రూ.10 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Harish Rao | రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పొట్టు పొట్టు తిడుతున్నరు

Ramayana | రామాయణంలోని మరో కోణం - లక్ష్మణుడి కథతో సినిమా - షూటింగ్ మొత్తం ఏఐతోనే...



