MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నా.. ప్రజల కోసం యుద్ధం చేస్తా
MLA Anirudh Reddy | అధికార పార్టీల ఉన్నప్పటికీ ప్రజల కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
- రాసి పెట్టుకోండి! నేనుండగా కబ్జాలు జరగవ్
- డబుల్ రిజిస్ట్రేషన్లు అయితే అధికారులే సస్పెండ్ అయితరు.. ఇది నా మాట
- చెత్తగా మాట్లాడే బీఆర్ఎసోళ్లు పదేండ్లల్ల ఏం పీకిర్రో ప్రజలకే చెప్పాలి
- నేనొచ్చి మూడేండ్లు కూడా దాటలే
- మరోసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Anirudh Reddy | త్రినేత్ర న్యూస్: అధికార పార్టీల ఉన్నప్పటికీ ప్రజల కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్తగా మాట్లాడే బీఆర్ఎస్ (BRS) వాళ్లు పదేండ్లల్ల ఏం పీకిర్రో ప్రజలకే చెప్పాలన్నారు. తానుండగా జర్చర్లలో కబ్జాలు జరగవని.. అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయితే అధికారులు సస్పెండ్ అవడం ఖాయమని హెచ్చరించారు. కబ్జాలు చేసే బీజేపీ (BJP) నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాదేపల్లిలో శనివారం ఆయన పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
చెత్తగా మాట్లాడే బీఆర్ఎస్ నాయకులకు, కొంతమంది నిన్న మొన్న కబ్జాలు చేసే బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ్నో చిల్లరగ మాట్లడుతున్నరు. ఈ బిల్డింగ్ అరబిందో నుంచి.. నేన్ అసెంబ్లీల పొల్యూషన్ గురించి మాట్లడిన. మీరయ్యుంటే ఒక ఫ్యాక్టరీ గురించి మాట్లాడి.. పోయి ఫ్యాక్టరీలల్ల వసూళ్లు చేస్తుండే. నేన్ వాళ్లతో మాట్లాడి నాలుగు కోట్ల రూపాయలు సీఎస్ఆర్ ఆక్టివిటీ నుంచి పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్లు ఎక్కడైతే పడిపోతున్నయో అవి కట్టిస్తున్నరు. ఇది బాదేపల్లిలోని హరిజనవాడలో దాదాపు కోటిన్నర లక్షలతోని స్కూల్ బిల్డింగ్ కడుతున్నరు. ఎంత బాగ కడుతున్నరో చూడండి.
సిగ్గులేనివాళ్లు ఏదేదో మాట్లాడుతున్నరు. పోయి ఊరుకొండ మండలంలోని గుడిగాన్‌పల్లిల చూడండి.. చూసి మాట్లాడండి. అక్కడ కూడా కోటి ఎనభై లక్షలు పెట్టి కడుతున్నరు. పెద్ద పెద్దయ్ మాట్లాడుతున్నరు. పదేండ్ల నుంచి అధికారంలో ఉండి ఒక్క స్కూల్ రెన్యువేట్ చేయలే. కబ్జాలు అయితలేవనే కదా మీకు బాధ. రాసి పెట్టుకోండి.. జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఉన్నంత వరకు జడ్చర్ల నియోజకవర్గంలో కబ్జాలు అనేవి జరగవు. డబుల్ రిజిస్ట్రేషన్లు కావు. అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయితే అధికారులు సస్పెండ్ అవుతారు. ఇది నా మాట.
పిచ్చి పిచ్చి మాటలు మానండి
పదేండ్ల నుంచి ఏమేం పీకిండ్రో ప్రజలకు చెప్పండి. నేను ఎమ్మెల్యేను అయి మూడేండ్లు కూడా కంప్లీట్ కాలేదు. నేన్ అధికార పార్టీల ఉండి నా ప్రజల కోసం కొట్లాడ్త. యుద్ధం చేస్తా. మీరు పిచ్చి పిచ్చి మాటలు మానుకొని పదేండ్లల్ల ఏంజేసిర్రో పబ్లిక్‌కే చెప్పండి అని అనిరుధ్‌రెడ్డి హితవు పలికారు.
తాజావార్తలు
- ●Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ
- ●AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల
- ●IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..
- ●Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!
- ●PM Modi Gamcha Swirl Vaishali | ఓపెన్ వాహనంలో మోదీ 'గమ్చా' మేనియా.. గంగా నదిపై భారీ బ్రిడ్జికి 'నితీశ్ సేతు' పేరు
- ●Priyanka Chopra | "వారణాసి"కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డబ్బింగ్ - కండీషన్ పెట్టిన రాజమౌళి

Kalvakuntla Kavitha | సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ

AgriGold | అగ్రిగోల్డ్ బాధితులకు బిగ్ రిలీఫ్.. బాండ్ల వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల

IIT Madras | రూ.500కే ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ కోర్సులు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అవకాశం..

Safran | తెలంగాణకు ఏరోస్పేస్ రంగంలో మరో భారీ పెట్టుబడి..!





