Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే
Abhijeet Dipke | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞనేష్ కుమార్ (Abhijeet Dipke) 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) డిమాండ్ చేశారు.
- 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించడం చిన్న విషయం కాదు
- ఓట్ల తొలగింపుతోనే దీదీ, స్టాలిన్, కేజ్రీ, పినరయి ఓడిపోయారు
- జ్ఞానేశ్ కుమార్ సీఈసీ అయ్యాక పరిస్థితి మారిపోయింది
- అంతా ప్రభుత్వమే నిర్ణయిస్తోంది
- జంతర్ మంతర్ 2.0 ఉద్యమం ఖాయం
Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈసీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞనేష్ కుమార్ (Abhijeet Dipke) 48 గంటల్లోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ఉన్నాయని విమర్శించారు.
గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో దిప్కే మాట్లాడారు. "చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. భారత ప్రజాస్వామ్యానికి ఆయన పెను ప్రమాదకరం. మన దేశంలో ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. కానీ జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరు ఓటు వేయాలి, ఎవరు వేయకూడదు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..? ప్రజాస్వామ్యానికి మీరిస్తున్న నిర్వచనం ఇదేనా..?" అంటూ నిలదీశారు. భారతదేశంలోని ప్రజాస్వామ్య భావనను, వ్యవస్థను పూర్తిగా తలకిందులు చేశారని దిప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెజారిటీ కోసం కుట్ర..
దేశవ్యాప్తంగా మొత్తం 13 కోట్లకు పైగా ఓట్లు తొలగించారని, ఇది చిన్న సంఖ్య కాదని దిప్కే అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య కేవలం 2 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తు చేశారు. అధికారాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండేందుకు ఆ 2 శాతం ఓట్ల తేడాని కూడా పెంచుకునేందుకు ఓట్లను తొలగిస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఇన్ని ఓట్లను తొలగించాల్సిన అవసరం ఏముంది..? అంటూ నిలదీశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలను ఒక్కొక్కరిగా లక్ష్యంగా చేసుకుని ఓట్లు తొలగించారని దిప్కే ఆరోపించారు. ఈ క్రమంలో పలువురు ముఖ్య నేతల నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు గల్లంతైనట్లు వివరించారు.
ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టడమే లక్ష్యం..
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గం నుండి 50,000 ఓట్లు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నియోజకవర్గం నుండి 1,00,000 ఓట్లు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గం నుంచి 40,000 ఓట్లు తొలగించారని దిప్కే పేర్కొన్నారు. కేరళలోనూ అదే పరిస్థితని చెప్పారు. ఓట్ల తొలగింపు కారణంగానే వారంతా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని విమర్శించారు. ప్రతిపక్షానికి బలమైన నాయకులను ఒక్కొక్కరిగా ఏరివేయడమే ఈ కసరత్తు ఉద్దేశమా..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో మొత్తం ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేస్తే ఆ ఎన్నికలను స్వేచ్ఛాయుతమైనవి, నిష్పక్షపాతమైనవిగా ఎలా పరిగణిస్తారు అంటూ నిలదీశారు.
రాజీనామా చేయకపోతే జంతర్ మంతర్ 2.0 ఉద్యమం
ఈ సందర్భంగా జ్ఞానేశ్ కుమార్‌కు కాక్రోచ్ పార్టీ అల్టిమేటం జారీ చేసింది. 48 గంటల్లో ఆయన తన పదవికి రాజీనామా చేయకపోతే.. దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది. అంతేకాదు, జంతర్ మంతర్ వద్ద 2.0 ఉద్యమం చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు దిప్కే హెచ్చరించారు."ఓటర్ల హక్కులను జ్ఞానేశ్ కుమార్ కాలరాస్తున్నారు. 48 గంటల్లో ఆయన రాజీనామా చేయాలి. లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహిస్తాం. అప్పటికీ సీఈసీ స్పందించకపోతే జంతర్ మంతర్ వద్ద 2.0 ఖాయం" అని దిప్కే స్పష్టం చేశారు.
Also Read..
శబరిమల ఆలయంలో బంగారు కిరీటం మాయం..?
రెట్రో లుక్‌లో రణభీర్‌కపూర్ - లవ్ అండ్ వార్ ప్రమోషన్స్ షురూ
15 ఏళ్ల ఐటీ అనుభవం.. ఒక్క క్షణంలో గాల్లోకి: ఏఐ దెబ్బకు ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెకీ
సంబంధిత వార్తలు

Abhijeet Dipke | జ్ఞానేశ్ ఇట్స్ డన్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆసక్తికర పోస్ట్
సెప్టెంబర్ 24, 2026

Supreme Court | ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంలో భిన్న తీర్పులు
సెప్టెంబర్ 23, 2026

Election Commission | సర్పై ఈసీలో అంతర్గత విభేదాలు.. జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ - ఇంద్రలోకం నుంచి అప్సరసలు భూమిపైకి వస్తే !
- ●Advocate Dundu Manmohan | దుండు మన్మోహన్కు సీనియర్ అడ్వకేట్ హోదా.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
- ●Ponnam Prabhakar | 'సర్'పై ఎన్నో అనుమానాలు
- ●Enugula Rakesh Reddy | రెండు డీఏలు ఇస్తామని ఉద్యోగులను అవమానించారు
- ●Bengaluru Traffic Hack | గంటకు 70 కిమీ వేగంతో దూసుకెళ్లొచ్చు.. బెంగళూరు ట్రాఫిక్కు చెక్ పెడుతున్న వింత వాహనం
- ●Alleti Maheshwar Reddy | మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి

Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ - ఇంద్రలోకం నుంచి అప్సరసలు భూమిపైకి వస్తే !

Advocate Dundu Manmohan | దుండు మన్మోహన్కు సీనియర్ అడ్వకేట్ హోదా.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Ponnam Prabhakar | 'సర్'పై ఎన్నో అనుమానాలు

Enugula Rakesh Reddy | రెండు డీఏలు ఇస్తామని ఉద్యోగులను అవమానించారు



