త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగుల‌తో తొలి జాబితా రిలీజ్‌

Punjab Assembly elections | వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (Punjab Assembly elections) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) శంఖారావం పూరించింది. 40 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన తొలి జాబితాను శ‌నివారం విడుద‌ల చేసింది. తొలి జాబితాలో మొత్తం సిట్టింగుల‌కే అవ‌కాశం క‌ల్పించింది.

D

National | Published On Oct 31, 2026, 1.26 pm IST

Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగుల‌తో తొలి జాబితా రిలీజ్‌
Advertisement

Punjab Assembly elections | త్రినేత్ర న్యూస్ : పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు (Punjab Assembly elections) జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఈ ఎన్నికల సమరానికి అధికార‌ ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) శంఖారావం పూరించింది. 40 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన తొలి జాబితాను శ‌నివారం విడుద‌ల చేసింది. తొలి జాబితాలో మొత్తం సిట్టింగుల‌కే అవ‌కాశం క‌ల్పించింది.

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) తన ప్రస్తుత నియోజకవర్గమైన ధూరి నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. ధూరి నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీకి కంచుకోటగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై సీఎం భగవంత్ మాన్ సుమారు 58,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అంతేకాదు, ఇటీవ‌లే జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆప్ త‌న స‌త్తా చాటింది. ధూరి మున్సిపల్ కౌన్సిల్‌లోని మొత్తం 21 వార్డుల్లో 20 వార్డులను కైవసం చేసుకుని త‌న ప‌ట్టు నిలుపుకుంది. ఇక లుధియానా వెస్ట్ స్థానం నుంచి మంత్రి సంజీవ్ అరోరా, కోట్‌కపురా స్థానం నుంచి పంజాబ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ కుల్తార్‌సింగ్ సంద్‌వాన్ బ‌రిలో నిలిచారు.

ఈ మేర‌కు ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి పంక‌జ్ కుమార్ గుప్తా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశం అనంతరం ఈ జాబితాను ఖరారు చేశారు. ప్రజల నుండి సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా సానుకూల స్పందన ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఈ జాబితాలో ప్రాధాన్యతనిచ్చినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు.

ప్ర‌స్తుత శాసనసభ గడువు 2027 మార్చి 16 నాటికి ముగియనుంది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆప్‌, కాంగ్రెస్‌, శిరోమణి అకాళీదళ్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. శిరోమణి అకాళీదళ్‌, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేర‌కు ఇరు పార్టీలు కొన్ని రోజులుగా మంత‌నాలు జ‌రుపుతున్నాయి. ఇక ఈ సారి పంజాబ్‌లో పాగా వేయాల‌ని బీజేపీ ప‌ట్టుద‌లతో ఉంది. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణాను అస్త్రంగా మ‌ల‌చుకొని ఇప్ప‌టికే మాన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.

Also Read..

ఈత కొడుతుండ‌గా క‌రెంట్ షాక్‌.. ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ఇద్ద‌రు విదేశీయులు మృతి

దిల్జీత్‌తో వివాదానికి ముగింపు.. దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌

జైల్ బ్రేక్ ఘ‌ట‌న‌.. సీఎం విజ‌య్ కీల‌క నిర్ణ‌యం

ట్యాగ్స్:

Aam Aadmi PartyAAPBJPCM Bhagwant MannCongressPunjabPunjab Assembly Elections
Advertisement
Advertisement