త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA | రామంతాపూర్‌లోని పెద్ద చెరువు వ‌ద్ద‌ హైడ్రా కూల్చివేతలు..

HYDRAA | హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని (Ramanthapur) పెద్ద చెరువు పరిధిలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో ఉన్న భారీ షెడ్‌ను అధికారులు తొలగించారు.

G

Hyderabad | Published On Oct 31, 2026, 1.03 pm IST

HYDRAA | రామంతాపూర్‌లోని పెద్ద చెరువు వ‌ద్ద‌ హైడ్రా కూల్చివేతలు..
Advertisement

HYDRAA | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని (Ramanthapur) పెద్ద చెరువు పరిధిలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ (FTL) పరిధిలో ఉన్న భారీ షెడ్‌ను అధికారులు తొలగించారు. అయితే హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి హైడ్రా కూల్చివేసిన‌ట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తాము గత 40 ఏండ్లుగా పన్నులు, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని, ఇన్నేళ్ల తర్వాత తమ ఆస్తిని కూల్చివేయడం బాధాకరమని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షెడ్ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉంద‌ని మూడు రోజుల క్రితం హైడ్రా అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో షెడ్ య‌జ‌మానులు హైకోర్టును (High Court) ఆశ్రయించామని తెలిపారు. చెరువు పరిధిలో భూమి ఉంటే.. ఇన్నేండ్లుగా పన్నులు ఎందుకు వసూలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగా చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను స్పష్టంగా నిర్ధరించిన తర్వాతే చర్యలు తీసుకోవాలన్న‌ కోర్టు.. స్టేట‌స్ కో (మ‌థాత‌థ స్థితి)ని పాటించాల‌ని ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ హైడ్రా కూల్చివేత‌లు చేప‌ట్టింద‌ని.. హైకోర్టు ఆదేశాలున్న‌ ఫలితం లేకపోయిందని బాధితులు వాపోయారు. చట్టబద్ధంగా ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. సరైన ప్రక్రియను అనుసరించిన తర్వాతే చర్యలు చేపట్టాలని యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్:

FTLHigh CourtHYDRAAHYDRAA DemolitionsPedda CheruvuRamanthapur
Advertisement
Advertisement