త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maserati | భార‌త్‌లో లాంచ్ అయిన మ‌సెర‌టి ఎల‌క్ట్రిక్‌ కార్లు.. ఒక్క‌సారి చార్జ్ చేస్తే 540 కిలోమీట‌ర్లు వెళ్ల‌వ‌చ్చు..

Maserati | ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మసెరటి భారత్‌లో 2027 గ్రాన్‌టురిస్మో, గ్రాన్‌కాబ్రియో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను విడుదల చేసింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ కార్ల ధరలు రూ.2.62 కోట్ల నుంచి రూ.3.30 కోట్ల వరకు ఉన్నాయి. అత్యధికంగా 761 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ వెర్షన్ కేవలం 2.5 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

S

Automobiles | Published On Oct 31, 2026, 1.25 pm IST

Maserati | భార‌త్‌లో లాంచ్ అయిన మ‌సెర‌టి ఎల‌క్ట్రిక్‌ కార్లు.. ఒక్క‌సారి చార్జ్ చేస్తే 540 కిలోమీట‌ర్లు వెళ్ల‌వ‌చ్చు..
Advertisement

Maserati | ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మసెరటి భారత్‌లో 2027 గ్రాన్‌టురిస్మో, గ్రాన్‌కాబ్రియో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను విడుదల చేసింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ కార్ల ధరలు రూ.2.62 కోట్ల నుంచి రూ.3.30 కోట్ల వరకు ఉన్నాయి. అత్యధికంగా 761 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ వెర్షన్ కేవలం 2.5 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

3.9 సెక‌న్ల‌లో గంట‌కు 100 కిలోమీట‌ర్ల వేగం..

మసెరటి కొత్త 2027 గ్రాన్‌టురిస్మో, గ్రాన్‌కాబ్రియో మోడళ్లు రెండో తరం స్పోర్ట్స్ కార్లకు అందించిన తొలి సమగ్ర అప్‌డేట్‌గా నిలిచాయి. 490, ట్రోఫియో, ఫోల్గోరే అనే మూడు వేరియంట్లలో ఈ కార్లు లభిస్తాయి. 490, ట్రోఫియో మోడళ్లలో 3.0 లీటర్ ట్విన్ టర్బో నెట్టునో వీ6 పెట్రోల్ ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. 490 వేరియంట్ 490 పీఎస్ పవర్, 600 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రోఫియో వేరియంట్ 590 పీఎస్ పవర్, 650 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. గ్రాన్‌టురిస్మో 490 కేవలం 3.9 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగా, గరిష్ఠ వేగం గంటకు 302 కిలోమీటర్లు. గ్రాన్‌కాబ్రియో 490 ఇదే వేగాన్ని 4 సెకన్లలో అందుకుంటుంది. ట్రోఫియో కూపే 3.5 సెకన్లలో, కన్వర్టిబుల్ 3.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటాయి. వీటి గరిష్ఠ వేగాలు వరుసగా 320, 316 కిలోమీటర్లుగా ఉన్నాయి.

ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 540 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ఎలక్ట్రిక్ వెర్షన్లలో ఫోల్గోరే మోడళ్లలో 92.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌తోపాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను అందించారు. ముందు భాగంలో ఒకటి, వెనుక భాగంలో రెండు మోటార్లు ఉంటాయి. ఇవి కలిపి 761 పీఎస్ పవర్, 1,350 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. గ్రాన్‌టురిస్మో ఫోల్గోరే 2.5 సెకన్లలో, గ్రాన్‌కాబ్రియో ఫోల్గోరే 2.8 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. వీటి గరిష్ఠ వేగాలు వరుసగా 325, 290 కిలోమీటర్లు. డబ్ల్యూఎల్‌టీపీ ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 540 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 270 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో బ్యాటరీని 20 నుంచి 80 శాతం వరకు కేవలం 18 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 22 కిలోవాట్ ఏసీ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అవసరం లేనప్పుడు ముందు మోటారును డిస్‌కనెక్ట్ చేసే స్మార్ట్ వ్యవస్థ ద్వారా విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ధ‌ర‌లు ఎంతంటే..

డిజైన్, ఫీచర్ల పరంగా కూడా పలు మార్పులు చేశారు. ఎంసీపురా మోడల్ స్ఫూర్తితో కొత్త ఫ్రంట్ బంపర్లు, క్లియర్ లెన్స్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, డార్క్ శాటిన్ అల్యూమినియం స్పోక్స్‌తో అప్‌డేట్ చేసిన స్టీరింగ్ వీల్‌ను అందించారు. అన్ని వేరియంట్లలో ఎయిర్ సస్పెన్షన్‌ను ప్రామాణికంగా ఇచ్చారు. కొత్త కంట్రీ డ్రైవింగ్ మోడ్ ద్వారా రోడ్లు అసమానంగా ఉన్నప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్‌ను 20 మిల్లీమీటర్లు పెంచుకోవచ్చు. ట్రోఫియో వేరియంట్లలో ట్రాక్‌పై డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోర్సా మోడ్ కొనసాగుతుంది. మసెరటి ఫ్యూరిసెరీ ప్రోగ్రామ్ ద్వారా కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌ను కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. గ్రాన్‌టురిస్మో కూపే ధర రూ.2.62 కోట్ల నుంచి రూ.3.14 కోట్ల వరకు ఉంది. గ్రాన్‌కాబ్రియో కన్వర్టిబుల్ ధరను రూ.2.91 కోట్ల నుంచి రూ.3.30 కోట్ల వరకు నిర్ణయించారు. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలుగా ఉన్నాయి.

ట్యాగ్స్:

2027 Maserati GranTurismoLuxury Cars IndiaMaseratiMaserati GranCabrioMaserati India Launch
Advertisement
Advertisement