త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | జైల్ బ్రేక్ ఘ‌ట‌న‌.. సీఎం విజ‌య్ కీల‌క నిర్ణ‌యం

CM Vijay | త‌మిళ‌నాడులోని తేని జిల్లా స‌బ్‌జైలు (Theni sub-jail) నుంచి 17 మంది ఖైదీలు త‌ప్పించుకున్న (Inmates Escape) ఘ‌ట‌నపై ముఖ్య‌మంత్రి విజ‌య్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ తేని సబ్‌జైలు ఇన్‌ఛార్జ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్. రామలింగం (N. Ramalingam) ను తక్షణమే స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించారు.

D

National | Published On Oct 31, 2026, 11.40 am IST

CM Vijay | జైల్ బ్రేక్ ఘ‌ట‌న‌.. సీఎం విజ‌య్ కీల‌క నిర్ణ‌యం
Advertisement

CM Vijay | త్రినేత్ర న్యూస్ : త‌మిళ‌నాడులోని తేని జిల్లా స‌బ్‌జైలు (Theni sub-jail) నుంచి 17 మంది ఖైదీలు త‌ప్పించుకున్న (Inmates Escape) ఘ‌ట‌న ఇటీవ‌లే రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి విజ‌య్ క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ తేని సబ్‌జైలు ఇన్‌ఛార్జ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎన్. రామలింగం (N. Ramalingam) ను తక్షణమే స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించారు. అంతేకాదు, ఈ భద్రతా వైఫల్యానికి బాధ్యులైన ఇతర జైలు సిబ్బందిపై కూడా చ‌ర్య‌ల‌కు ఆదేశించారు.

జైళ్ల శాఖ‌లో భారీ బ‌దిలీల‌కు సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగానే భద్రతా లోపాల కారణంగా మధురై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆర్. కృష్ణరాజ్‌ను సేలం సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. జైళ్ల‌లో భ‌ద్ర‌త‌, నిఘా విష‌యంలో ఎలాంటి అల‌స‌త్వాన్ని స‌హించేది లేద‌ని సీఎం విజ‌య్ ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే అధికారుల‌లై క‌ఠిన‌మైన శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. జైళ్లలో మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌ను సీఎం ఆదేశించారు.

కాగా, అక్టోబ‌ర్ 26న ఈ భారీ జైల్ బ్రేక్ (Jailbreak) ఘ‌ట‌న చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. మూర్ఛ వ‌స్తున్న‌ట్లు నాట‌కం ఆడిన ఖైదీలు జైలు నుంచి (Jailbreak) త‌ప్పించుకున్నారు. జైలులోని ఓ గ‌దిలో 17 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో ఒక‌రికి ఆరోగ్యం బాగోలేద‌ని స‌మాచారం అంద‌డంతో జైలు సిబ్బంది ఆ గ‌దికి వెళ్లారు. ప్లాన్‌లో భాగంగా ఓ ఖైదీ ఫిట్స్ (Seizure) వ‌చ్చిన‌ట్లు న‌టించగా.. మిగిలిన‌వారు సిబ్బందిపై దాడిచేసి అక్క‌డి నుంచి పారిపోయారు (Inmates Escape). అప్ర‌మ‌త్త‌మైన అధికారులు బృందాలుగా విడిపోయి వారి కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పారిపోయిన వారంద‌రినీ ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల‌లో భ‌ద్ర‌త‌ను అధికారులు క‌ట్టుదిట్టం చేశారు.

Also Read..

ఏక్తా దివ‌స్‌.. ప‌టేల్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాని మోదీ

టెక్స్‌టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊర‌ట‌.. ప‌త్తి దిగుమ‌తుల‌పై సుంకం మిన‌హాయింపు గ‌డువు పొడిగింపు

భార‌త్‌పై పాక్ గెలుపు.. ప్ర‌ధాని ష‌రీఫ్‌పై నెట్టింట ట్రోల్స్‌

ట్యాగ్స్:

CM VijayInmates EscapeJailbreakSuspension Of Deputy Jail SuperintendentTamil NaduTheni Sub Jail
Advertisement
Advertisement