Seethakka | పింఛన్ వచ్చే భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్: మంత్రి సీతక్క
Seethakka | భర్త చనిపోతే అర్హత మేరకు భార్యకు వెంటనే పింఛన్ (Pension) మంజూరు చేస్తామని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు.
Seethakka | త్రినేత్ర న్యూస్: భర్త చనిపోతే అర్హత మేరకు భార్యకు వెంటనే పింఛన్ (Pension) మంజూరు చేస్తామని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరో మానవీయ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక అన్ని ప్రధాన సామాజిక భద్రతా పింఛన్లలోనూ ఇన్‌స్టంట్ పెన్షన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితుల కుటుంబాలకు ఎంతో ఊరట దక్కనున్నట్లు వెల్లడించారు.
ఇక నుంచి ఇతర కేటగిరీలకు కూడా
పింఛన్ వచ్చే భర్తలు మరణించిన సందర్భాల్లో వారి భార్యలకు తక్షణమే సామాజిక భద్రతా పింఛన్ మంజూరు చేసే ఇన్‌స్టంట్ పెన్షన్ సదుపాయాన్ని మరిన్ని కేటగిరీలకు విస్తరించాం. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వృద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆయన భార్యకు ఇన్‌స్టంట్ పెన్షన్ మంజూరు చేసే సదుపాయం అమల్లో ఉంది. తాజాగా ప్రభుత్వం ఈ సదుపాయాన్ని ఇతర పింఛన్ కేటగిరీలకు కూడా విస్తరించింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళ ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. మరణించిన పురుష పింఛన్‌దారుడి భార్య వయస్సు 57 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే వితంతు పింఛన్, 57 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తాం.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తుతో పాటు భార్య ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ, మరణించిన పింఛన్‌దారుడి ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి, చేయూత పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి అర్హత ధ్రువీకరించుకున్న తర్వాత పెన్షన్ మంజూరు చేస్తారు అని సీతక్క పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
అక్టోబర్ 31, 2026

Bhatti Vikramarka | హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.84,790 కోట్లతో సమగ్ర కార్యాచరణ : భట్టి విక్రమార్క
అక్టోబర్ 30, 2026

CM Revanth Reddy | హై స్పీడ్ రైళ్లకు ఎలాంటి భూసేకరణ చేయలేదు.. కేంద్రానికి సీఎం వివరణ
అక్టోబర్ 30, 2026
తాజావార్తలు
- ●Bengaluru 5 Star Hotel | ఫైవ్‌స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు దుర్మరణం
- ●Vi | వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన వీఐ, జియో.. ప్యాక్ ధరలు ఎంతంటే..?
- ●UK Student Visa | యూకే స్టూడెంట్ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయ విద్యార్థులపై రూ.18 లక్షల భారం..
- ●Abhijeet Dipke | దిల్జీత్తో వివాదానికి ముగింపు.. దిప్కే ఆసక్తికర పోస్ట్
- ●Vijayanagara Empire History | 500 ఏళ్ల కిందటే మన దేశంలో గ్రాండ్ షాపింగ్ మాల్.. రత్నాలు, గుర్రాలు అమ్మిన ఆ అద్భుత వీధి ఎక్కడుందో తెలుసా?
- ●KTR | ఐడీబీఐ ప్రైవేటీకరణ.. అంత తొందర ఎందుకు?.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

Bengaluru 5 Star Hotel | ఫైవ్‌స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు దుర్మరణం

Vi | వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన వీఐ, జియో.. ప్యాక్ ధరలు ఎంతంటే..?

UK Student Visa | యూకే స్టూడెంట్ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయ విద్యార్థులపై రూ.18 లక్షల భారం..

Abhijeet Dipke | దిల్జీత్తో వివాదానికి ముగింపు.. దిప్కే ఆసక్తికర పోస్ట్



