త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vi | వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేసిన వీఐ, జియో.. ప్యాక్ ధ‌ర‌లు ఎంతంటే..?

Vi | టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ ఇటీవ‌లే త‌న తొలి వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అదే బాట‌లో ఇప్పుడు జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేశాయి. దీని వల్ల కేవ‌లం వాయిస్ కాల్స్ మాత్ర‌మే వాడేవారికి రీచార్జి ధ‌ర‌ల విష‌యంలో కాస్త ఊర‌ట ల‌భించ‌నుంది. ట్రాయ్ ఆదేశాల మేర‌కు ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లలో మొబైల్ డేటా లేకుండా అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. రూ.147 నుంచి ప్రారంభమయ్యే ఈ రీఛార్జ్ ప్లాన్లతో డేటా అవసరం లేని వినియోగదారులకు ఖర్చు తగ్గనుంది.

S

Technology | Published On Oct 31, 2026, 12.37 pm IST

Vi | వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేసిన వీఐ, జియో.. ప్యాక్ ధ‌ర‌లు ఎంతంటే..?
Advertisement

Vi | టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ ఇటీవ‌లే త‌న తొలి వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అదే బాట‌లో ఇప్పుడు జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేశాయి. దీని వల్ల కేవ‌లం వాయిస్ కాల్స్ మాత్ర‌మే వాడేవారికి రీచార్జి ధ‌ర‌ల విష‌యంలో కాస్త ఊర‌ట ల‌భించ‌నుంది. ట్రాయ్ ఆదేశాల మేర‌కు ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లలో మొబైల్ డేటా లేకుండా అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. రూ.147 నుంచి ప్రారంభమయ్యే ఈ రీఛార్జ్ ప్లాన్లతో డేటా అవసరం లేని వినియోగదారులకు ఖర్చు తగ్గనుంది.

రీచార్జ్ ప్లాన్ల‌లో కీల‌క‌మార్పులు..

దేశీయ టెలికాం రంగంలో రీఛార్జ్ ప్లాన్ల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో పాటు తప్పనిసరిగా డేటా ప్రయోజనాలు కూడా కలిపి అందించే టెలికాం సంస్థలు.. తాజాగా ప్రత్యేక వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ముందుగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా, ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ జియో, వీఐ కూడా తమ‌ ప్రీపెయిడ్ జాబితాల‌లో ఆ ప్లాన్ల‌ను చేర్చింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ వినియోగదారులు, రెండో సిమ్ ఉపయోగించేవారు, ఇంటర్నెట్ కోసం వైఫైపై ఆధారపడేవారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి.

జియో, వీఐ వాయిస్ ఓన్లీ ప్లాన్లు ఎలా ఉన్నాయి..?

రిలయన్స్ జియో రూ.147తో ప్రారంభమయ్యే ఆరు ప్లాన్లను అందిస్తోంది. రూ.147 ప్లాన్‌తో 22 రోజులు, రూ.177తో 28 రోజులు, రూ.196తో 30 రోజులు, రూ.197తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ నాలుగు ప్లాన్లలో అపరిమిత దేశీయ కాల్స్‌తోపాటు 300 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు. ఇక రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 1,000 ఎస్ఎంఎస్‌లు, జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్ సేవలు లభిస్తాయి. రూ.1,748 ప్లాన్‌తో 336 రోజుల వ్యాలిడిటీ, 3,600 ఎస్ఎంఎస్‌లు, అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు వీఐ రూ.179 ప్లాన్‌తో 25 రోజులు, రూ.185తో 28 రోజులు, రూ.203తో 30 రోజులు, రూ.206తో ఒక క్యాలెండర్ నెల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. రూ.470 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 900 ఎస్ఎంఎస్‌లు, రూ.1,849 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, 3,600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.179 ప్లాన్‌లో వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ సదుపాయం కూడా ఉంది.

మొబైల్ డేటా ఉండ‌దు..

ఈ ప్లాన్లలో మొబైల్ డేటా ప్రయోజనాలు ఉండవు. వీఐ ప్లాన్లలో అదనంగా డేటా వినియోగిస్తే ప్రతి ఎంబీకి 50 పైసలు చెల్లించాలి. నిర్ణీత ఎస్ఎంఎస్ పరిమితి దాటిన తర్వాత లోకల్ ఎస్ఎంఎస్‌కు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌కు రూ.1.50 చొప్పున ఛార్జీలు వర్తిస్తాయి. జియో ప్లాన్లలోనూ డేటా ప్రయోజనాలు ఉండవు. ట్రాయ్ టెలికాం వినియోగదారుల పరిరక్షణ నిబంధనల ప్రకారం.. వాయిస్, ఎస్ఎంఎస్ సేవలకు ప్రత్యేక టారిఫ్ వోచర్లను అందించాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. గతంలో డేటా ఉపయోగించకపోయినా రోజుకు 1 జీబీ లేదా 1.5 జీబీ డేటా కలిగిన ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. తాజా మార్పులతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవల కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఏర్ప‌డింది.

ట్యాగ్స్:

AirtelJioPrepaid RechargeTraiViVodafone IdeaVoice Only Plans
Advertisement
Advertisement