త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | దిల్జీత్‌తో వివాదానికి ముగింపు.. దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Abhijeet Dipke | ప్ర‌ముఖ పంజాబీ గాయ‌కుడు (Punjabi singer), నటుడు దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh)తో నెల‌కొన్న వివాదానికి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ముగింపు కోరారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు.

D

National | Published On Oct 31, 2026, 12.18 pm IST

Abhijeet Dipke | దిల్జీత్‌తో వివాదానికి ముగింపు.. దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌
Advertisement

త్రినేత్ర న్యూస్ : ప్ర‌ముఖ పంజాబీ గాయ‌కుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh), కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే మ‌ధ్య వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై సీజేపీ చేప‌డుతున్న నిర‌స‌న‌కు దిల్జీత్ మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డంపై దిప్కే ప్ర‌శ్నించ‌డంతో వీరి మ‌ధ్య వివాదం చెల‌రేగింది.

నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌త‌రేకింగా ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన‌ నిర‌స‌న‌ల స‌మ‌యంలో విద్యార్థుల నిరసనలకు మద్దతు ఇస్తారా..? అంటూ ఓ అభిమాని దిల్జీత్‌ను ప్రశ్నించారు. స్పందించిన దిల్జీత్ "నేను కేవలం ఒక కళాకారుడిని. రాజకీయ నాయకుడిని కాదు. నన్ను వీటికి దూరంగా ఉంచండి" అని స‌మాధాన‌మిచ్చాడు. దీనిపై దిప్కే తీవ్రంగా స్పందించారు. దిల్జీత్ తన సినిమాల్లో తీవ్రమైన రాజకీయ, సామాజిక అంశాలను చూపిస్తూ, నిజ జీవితంలో విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా ద్వంద్వ ప్రమాణాలు (Hypocrisy) ప్రదర్శిస్తున్నారంటూ విమ‌ర్శించారు.

పంజాబీలకు పోట్లాడటం ఎలాగో నేర్పకండి

ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోని జవాహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిన్న సాయంత్రం జరిగిన కాన్సర్ట్‌లో తనపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పరోక్షంగా స్పందించారు. "నేను ఓ క‌ళాకారుడిగా మీ అందరినీ ప్రేమిస్తున్నాను. నేను మౌనంగా ఉన్నాను.. న‌న్ను ఇలాగే ఉండనివ్వండి. నేను మీ అందరికీ మద్దతుగా నిలుస్తాను. పంజాబీలకు పోట్లాడటం ఎలాగో నేర్పకండి" అని అన్నారు. 'మై హూ పంజాబ్'.. 'ఐ యామ్ యాన్ ఆర్టిస్ట్' అంటూ కార్య‌క్ర‌మాన్ని ముగించారు.

చిన్న త‌మ్ముడిని.. వివాదాన్ని ముగిద్దాం

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దిప్కే ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు సింగర్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వివాదానికి ముగింపు ప‌లకాల‌ని కోరారు. "చిన్న తమ్ముడిగా భావించి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మీరు గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల నేను చాలా బాధ‌ప‌డ్డాను. మీపై నాకు వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి క‌క్ష లేదు. నిజం చెప్పాలంటే నేను మీకు వీరాభిమానిని. ఇప్ప‌టికీ ఆ అభిమానంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు" అని దిప్కే స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా అమెరికాలో జ‌రిగిన దిల్జిత్ క‌న్స‌ర్ట్‌కు తాను హాజ‌రైన విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ వివాదాన్ని ఇక్క‌డితో ముగించాల‌ని ఈ సంద‌ర్భంగా దిప్కే కోరారు.

Also Read..

జైల్ బ్రేక్ ఘ‌ట‌న‌.. సీఎం విజ‌య్ కీల‌క నిర్ణ‌యం

ఏక్తా దివ‌స్‌.. ప‌టేల్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాని మోదీ

టెక్స్‌టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊర‌ట‌.. ప‌త్తి దిగుమ‌తుల‌పై సుంకం మిన‌హాయింపు గ‌డువు పొడిగింపు

ట్యాగ్స్:

Abhijeet DipkeCJP FounderDiljit DosanjhPunjabi Singer
Advertisement
Advertisement