త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru 5 Star Hotel | ఈత కొడుతుండ‌గా క‌రెంట్ షాక్‌.. ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ఇద్ద‌రు విదేశీయులు మృతి

Bengaluru 5 Star Hotel | బెంగళూరు (Bengaluru)లో విషాదం చోటు చేసుకుంది. ఉల్సూర్‌లోని కాన్రాడ్‌ (Conrad) ఫైవ్ స్టార్ హోటల్‌లోని (Bengaluru 5 Star Hotel) స్విమ్మింగ్ పూల్ (Swimming Pool)లో క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్ద‌రు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు.

D

National | Published On Oct 31, 2026, 12.51 pm IST

Bengaluru 5 Star Hotel | ఈత కొడుతుండ‌గా క‌రెంట్ షాక్‌.. ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో ఇద్ద‌రు విదేశీయులు మృతి
Advertisement

Bengaluru 5 Star Hotel | త్రినేత్ర న్యూస్‌ : బెంగళూరు (Bengaluru)లో విషాదం చోటు చేసుకుంది. న‌గ‌రంలోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్ స్విమ్మింగ్ పూల్ (Swimming Pool)లో విద్యుదాఘాతానికి (Electric Shock ) గురై ఇద్ద‌రు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉల్సూర్‌లోని కాన్రాడ్‌ (Conrad) ఫైవ్ స్టార్ హోటల్‌లో (Bengaluru 5 Star Hotel) శుక్ర‌వారం సాయంత్రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతులు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ (Lufthansa Airlines) సిబ్బంది అయిన జర్మన్ జాతీయుడు అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థీస్ (57), టెక్ దిగ్గజం ఐబీఎం (IBM)లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న స్లొవేకియా దేశస్తుడు జురాజ్ హోర్వాట్ (45)గా గుర్తించారు.

వీరిద్దరూ ఈత కొట్టేందుకు మూడో అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారిని కాపాడే ప్ర‌య‌త్నంలో మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. అప్ర‌మ‌త్త‌మైన హోట‌ల్ యాజ‌మాన్యం గాయ‌ప‌డిన ఇద్ద‌రినీ చికిత్స నిమిత్తం వెంట‌నే మ‌ణిపాల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై హోట‌ల్ యామ‌జమాన్యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై స్ప‌ష్ట‌త లేదు. ఈ ప్ర‌మాదంపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

హిల్ట‌న్ గ్రూప్‌న‌కు చెందిన ఈ హోట‌ల్ న‌గ‌రంలోనే ప్ర‌సిద్ధి చెందింది. ఇక్క‌డ ఒక రాత్రి సాధార‌ణ గ‌ది అద్దె సుమారు రూ.25,000 వ‌ర‌కూ ఉంటుంది. అంత‌టి ఖ‌రీదైన, ప్ర‌ఖ్యాత హోట‌ల్‌లో ఇలాంటి దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక ఈ ఘ‌ట‌న అనంత‌రం నిర్వ‌హ‌ణ నిమిత్తం స్విమ్మింగ్ పూల్‌ను అక్టోబ‌ర్ 31 నుంచి న‌వంబ‌ర్ 31 వ‌ర‌కూ తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు హోట‌ల్ యాజ‌మాన్యం త‌న వెబ్‌సైట్‌లో ప్ర‌క‌టించింది.

Also Read..

దిల్జీత్‌తో వివాదానికి ముగింపు.. దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌

జైల్ బ్రేక్ ఘ‌ట‌న‌.. సీఎం విజ‌య్ కీల‌క నిర్ణ‌యం

500 ఏళ్ల కిందటే మన దేశంలో గ్రాండ్ షాపింగ్ మాల్.. రత్నాలు, గుర్రాలు అమ్మిన ఆ అద్భుత వీధి ఎక్కడుందో తెలుసా?

ట్యాగ్స్:

BengaluruBengaluru 5 Star HotelElectric ShockLufthansa AirlinesSwimming PoolTwo Foreigners Die
Advertisement
Advertisement