Yamuna River | యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ
Yamuna River | బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (BJP MP Manoj Tiwari) యమునా నది (Yamuna River)లో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆ నీటిని తాగి.. నది కలుషితమైందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నదిలోని సగాన్ని పూర్తిగా శుభ్రం చేసిందని ప్రశంసించారు. నదిలో మునక వేయాలని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ సవాల్ విసిరింది.
Yamuna River | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలో ఛత్ పూజ (Chhath Puja) పండుగకు ముందు యమునా నది (Yamuna River) కాలుష్యం అంశం మరోసారి తీవ్ర రాజకీయ వివాదానికి (Political Row) కేంద్ర బిందువుగా మారింది. యమునా నదీ జలాలు కలుషితమయ్యాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (BJP MP Manoj Tiwari) సోనియా విహార్ ఘాట్ (Sonia Vihar ghat) వద్ద నదిలో పుణ్యస్నానం ఆచరించారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన శుభ్రత పనుల వల్ల గత ఏడాదితో పోలిస్తే నదిలో కాలుష్య స్థాయిలు సగానికి తగ్గాయంటూ సంచలన ప్రకటన చేశారు. ఇకపై ప్రజలు యమునా నదిలో ఛత్ పూజలు చేసుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా యమునా నదిలో మునకేసిన వీడియోని మనోజ్ తివారీ ఎక్స్‌లో పోస్టు చేశారు. "కొన్ని ప్రదేశాల్లో వలస పక్షులు కనిపిస్తున్నాయి. అంటే నది శుభ్రంగా ఉన్నట్లే. నది స్వచ్ఛంగా ఉంటేనే వలస పక్షులు వస్తాయి. ఇక్కడ నీటిలో మొసళ్లు కూడా ఉండొచ్చు" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత ఆప్ ప్రభుత్వంపై మనోజ్ తివారీ విమర్శలు గుప్పించారు. నదిని శుభ్రం చేయడంలో ఆప్ విఫలమైందని ఆరోపించారు. అంతేకాదు నది కాలుష్యానికి హర్యానా ప్రభుత్వమే కారణమని గతంలో ఆప్ నేతలు ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నదిలోని సగాన్ని పూర్తిగా శుభ్రం చేసిందని ప్రశంసించారు. మిగతా పనులు రాబోయే మూడేళ్లలో పూర్తవుతాయని చెప్పారు. కాంగ్రెస్, ఆప్ పార్టీలు 27 ఏళ్లలో చేయలేని పనిని తమ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిందని ఢిల్లీ బీజేపీ స్పష్టం చేసింది. నదిలో మునక వేయాలని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ సవాల్ విసిరింది.
Also Read..
నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను : ప్రధాని మోదీ
సీఈసీపై ప్రజా అభిశంసన కార్యక్రమం వాయిదా
కాలుష్య రహిత దీపావళి.. విరాట్ కోహ్లీతో అవగాహన కల్పించండి : సుప్రీంకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Public Impeachment | సీఈసీపై ప్రజా అభిశంసన కార్యక్రమం వాయిదా
అక్టోబర్ 30, 2026

Rahul Gandhi | కాంగ్రెస్ బ్యాంకులను నిర్మిస్తే.. బీజేపీ వాటిని అమ్ముతోంది : ఐడీబీఐ బ్యాంకు విక్రయంపై రాహుల్ గాంధీ విమర్శలు
అక్టోబర్ 30, 2026

Jairam Ramesh | సర్ అనేది మోదీ, షా కుట్ర.. సీఈసీ దీన్ని అమలు చేశారు : జైరామ్ రమేశ్
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Amit Shah | మూడోసారి అధికారంలోకి వస్తే యూసీసీ
- ●PM Modi | నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను : ప్రధాని మోదీ
- ●CM Revanth Reddy | రూ. 50,000 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్!
- ●Web Series Review | రుద్రవనం రివ్యూ - ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కావొద్దు : డిప్యూటీ సీఎం భట్టి
- ●Public Impeachment | సీఈసీపై ప్రజా అభిశంసన కార్యక్రమం వాయిదా

Amit Shah | మూడోసారి అధికారంలోకి వస్తే యూసీసీ

PM Modi | నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను : ప్రధాని మోదీ

CM Revanth Reddy | రూ. 50,000 కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్!

Web Series Review | రుద్రవనం రివ్యూ - ట్విస్ట్‌లతో సాగే తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?



