త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Papiya Adhikari | ట‌పాసులు కాల్చ‌డం వ‌ల్ల అనేక వ్యాధులు న‌య‌మ‌వుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Papiya Adhikari | ట‌పాసులు కాల్చ‌డం వ‌ల్ల అనేక వ్యాధులు న‌య‌మ‌వుతాయంటూ కోల్‌క‌తాలోని టోలీగంజ్ నియోజ‌కవ‌ర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (Tollygunge MLA) పాపియా అధికారి (Papiya Adhikari) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Nov 9, 2026, 12.56 pm IST

Papiya Adhikari | ట‌పాసులు కాల్చ‌డం వ‌ల్ల అనేక వ్యాధులు న‌య‌మ‌వుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Papiya Adhikari | త్రినేత్ర న్యూస్ : దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకొని బాణసంచా కాల్చ‌డంపై (bursting firecrackers) దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ట‌పాసులు కాల్చ‌డం వ‌ల్ల వాయు కాలుష్యం తీవ్ర‌మ‌వుతుంద‌ని, ఆ పొగ పీల్చ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ సంబంధిత‌ స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బాణ‌సంచా కాల్చ‌డంపై ప‌శ్చిమ బెంగాల్ (West Bengal)లో అధికార బీజేపీకి చెందిన ఓ మ‌హిళా ఎమ్మెల్యే (BJP MLA) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట‌పాసులు కాల్చ‌డం వ‌ల్ల అనేక వ్యాధులు న‌య‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.

కోల్‌క‌తాలోని టోలీగంజ్ నియోజ‌కవ‌ర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే (Tollygunge MLA) పాపియా అధికారి (Papiya Adhikari).. కాళీ పూజ వేడుక‌ల్లో (Kali Puja celebrations) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగిస్తుండ‌గా.. అక్క‌డ ట‌పాసుల శ‌బ్దం వినిపించింది. ఈ క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ టపాసులు కాల్చడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, టపాసులు లేకుండా కాళీ పూజ వేడుకలు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. అదే స‌మ‌యంలో టపాసులు కాల్చేటప్పుడు పోలీసులు, అధికార‌ యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా త‌ప్ప‌కుండా పాటించాలని ప్రజలకు సూచించారు.

దీపావ‌ళి, కాళీ పూజ వేడుక‌ల్లో గ్రీన్ క్రాక‌ర్స్ మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని సీఎం సువేందు అధికారి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌పై దుమారం చెల‌రేగింది. ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో స‌ద‌రు ఎమ్మెల్యే త‌న వ్యాఖ్యల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ట‌పాసుల నుంచి వ‌చ్చే పొగ గాలి ద్వారా వ్యాపించే క్రిమిసంహార‌కాల‌ను నాశ‌నం చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఆమె వాద‌న‌కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవ‌ని ఆరోగ్య నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు కొట్టిపారేశారు.

Also Read..

త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ.. సోషల్ మీడియా చూసి మేనల్లుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు తొలగించిన నిందితుడు

మంట‌ల్లో కారు.. చిన్నారి స‌హా ఆరుగురు స‌జీవ‌ద‌హ‌నం

88 రోజులైనా ముగియని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. 18 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Advertisement
Advertisement