Rajnath Singh | ప్రజలతో సత్సంబంధాలే దేశ రక్షణకు కొండంత బలం.. వాయుసేన సిబ్బందితో రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | మన సాయుధ దళాలు క్రమశిక్షణకు మారుపేరు అని రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సైనిక సిబ్బంది స్థానిక ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Rajnath Singh | త్రినేత్ర న్యూస్ : సైనిక సిబ్బంది స్థానిక ప్రజలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో లేదా వ్యూహాత్మక ప్రాంతాల్లో శత్రువులు పన్నే కుట్రలను తిప్పికొట్టడానికి కేవలం సైనిక శక్తి మాత్రమే కాకుండా స్థానిక ప్రజలతో ఏర్పడే ప్రేమపూర్వకమైన, మానవీయ అనుబంధాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సిలిగురి (Siliguri) సమీపంలో ఉన్న బాగ్డోగ్రా ఎయిర్‌ఫీల్డ్ (Bagdogra airfield)లో వాయుసేన (Indian Air Force) సిబ్బందితో రక్షణ మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో వాయుసేన అధికారులు, సిబ్బంది ప్రదర్శిస్తున్న అసమాన ధైర్యసాహసాలు, అంకితభావం, నిబద్ధతను కొనియాడారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "సరిహద్దుల్లో కేవలం ఆయుధాలు, పరాక్రమమే కాకుండా.. విధుల నిర్వర్తించే ప్రతి సైనికుడి ప్రవర్తన, క్రమశిక్షణ, మాట్లాడే భాష, సంయమనమే స్థానిక ప్రజల మనస్సులలో సైన్యం పట్ల సముచితమైన గౌరవ భావాన్ని నింపుతాయి. సైన్యం పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఆ ఆప్యాయతను కాపాడుకోవడం ప్రతి సైనికుడి బాధ్యత. స్థానిక ప్రజలతో సంబంధాలను మరింత బలపరుచుకోవాలి. ప్రేమపూర్వకమైన మానవీయ అనుబంధాలే శత్రువుల కుట్రలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి" అని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు.
అదేవిధంగా మన సాయుధ దళాలు క్రమశిక్షణకు మారుపేరు అని రాజ్‌నాథ్ తెలిపారు. "ఎంత అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ.. సైనికుల్లో క్రమశిక్షణ, ధైర్యం లేకపోతే అది వ్యర్థమే. మన సాయుధ దళాలు క్రమశిక్షణకు మారుపేరు. సాధారణ సైనికుడిని ఒక అసమాన యోధుడిగా మార్చేది క్రమశిక్షణే. మీ క్రమశిక్షణే మీకు అత్యంత బలమైన ఆయుధం" అని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. సైనిక దళాల శౌర్యం, ధైర్యం, అచంచలమైన అంకితభావాన్ని కొనియాడిన కేంద్ర మంత్రి.. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన దళాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read..
WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు
తాజావార్తలు
- ●Nithiin | యంగ్ లుక్‌లో నితిన్ - రుక్మిణి కోసం కృష్ణ నయా అవతారం
- ●Reliance Jio | జియో నుంచి 3 ఏళ్ల రీచార్జ్ ప్లాన్.. 2,700 జీబీ డేటా..
- ●MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది
- ●BYD | చైనా ఎలక్ట్రిక్ కార్ @ 500 కి.మీ. వేగం.. సరికొత్త ప్రపంచ రికార్డు..
- ●Air Pollution | WFH నిబంధనలు పాటించలేదని.. రెండు సంస్థలకు నోటీసులు
- ●IAF | లడఖ్‌లో చరిత్ర సృష్టించిన ఐఏఎఫ్..

Nithiin | యంగ్ లుక్‌లో నితిన్ - రుక్మిణి కోసం కృష్ణ నయా అవతారం

Reliance Jio | జియో నుంచి 3 ఏళ్ల రీచార్జ్ ప్లాన్.. 2,700 జీబీ డేటా..

MLC Dasoju Sravan | రేవంత్! గురుకుల బెడ్‌షీట్స్‌ను కోటు కుట్టించుకో.. తెలుస్తది

BYD | చైనా ఎలక్ట్రిక్ కార్ @ 500 కి.మీ. వేగం.. సరికొత్త ప్రపంచ రికార్డు..






