Gold Investment | రూ.50 వేలతో బంగారం కొనాలా? ఆభరణాలు, నాణేలు, డిజిటల్ గోల్డ్‌లో ఏది బెటర్?
Gold Investment | బంగారం కొనాలనుకునే వారికి ఆభరణాలు, బంగారు నాణేలు, డిజిటల్ గోల్డ్ రూపాల్లో పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి విధానంలోనూ ఖర్చులు, ప్రయోజనాలు, నష్టభయాలు వేర్వేరుగా ఉంటాయి. పెట్టుబడి లక్ష్యమా? ఆభరణాల వినియోగమా? సులభంగా కొనుగోలు చేయడమా? అనే అంశాలను బట్టి సరైన ఎంపిక చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Gold Investment | బంగారం కొనాలనుకునే వారికి ఆభరణాలు, బంగారు నాణేలు, డిజిటల్ గోల్డ్ రూపాల్లో పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి విధానంలోనూ ఖర్చులు, ప్రయోజనాలు, నష్టభయాలు వేర్వేరుగా ఉంటాయి. పెట్టుబడి లక్ష్యమా? ఆభరణాల వినియోగమా? సులభంగా కొనుగోలు చేయడమా? అనే అంశాలను బట్టి సరైన ఎంపిక చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆభరణాలను కొనుగోలు చేయాలా..?
భారతీయ కుటుంబాల్లో పండుగలు, శుభ కార్యాల సమయాల్లో బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నుంచి రక్షణ కల్పించే పెట్టుబడిగా కూడా బంగారానికి ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో రూ.50వేల పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఏ రూపంలో బంగారం కొనుగోలు చేయాలనే సందిగ్ధంలో ఉంటున్నారు. ఆభరణాలు కొనుగోలు చేస్తే తయారీ ఛార్జీలు, జీఎస్టీ అదనపు భారంగా మారతాయి. అలాగే విక్రయించే సమయంలోనూ కొన్ని తగ్గింపులు ఉండడంతో పెట్టిన మొత్తం పూర్తిగా తిరిగి వచ్చే అవకాశం ఉండదు. అయితే ఆభరణాలను ధరించేందుకు, ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించేందుకు ఇష్టపడేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.
బంగారాన్ని దాచుకోవాలని చూస్తే..?
భౌతిక బంగారాన్ని పెట్టుబడిగా దాచుకోవాలనుకునేవారికి బంగారు నాణేలు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఆభరణాలతో పోలిస్తే తయారీ ఛార్జీలు తక్కువగా ఉండడం, వివిధ బరువుల్లో అందుబాటులో ఉండడం వీటి ప్రత్యేకత. అయితే గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా ప్రముఖ నగల దుకాణాల నుంచి బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న నాణేలను కొనుగోలు చేయాలి. తిరిగి విక్రయించే సమయంలో వర్తించే బైబ్యాక్ నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలి. మరోవైపు డిజిటల్ గోల్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చిన్న మొత్తాలతో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. భద్రపరిచే ఇబ్బంది ఉండదు. అయితే డిజిటల్ గోల్డ్‌కు సెబీ నియంత్రణ పరిధిలోని గోల్డ్ ఈటీఎఫ్‌ల తరహా నియంత్రణ లేదు. ప్లాట్‌ఫామ్ ఛార్జీలు, జీఎస్టీ, నిల్వ విధానం, తిరిగి విక్రయించడం లేదా భౌతిక బంగారంగా మార్చుకునే నిబంధనలను పరిశీలించాలి.
రూ.50 వేలతో ఏది ఎంచుకోవాలి?
దీర్ఘకాలికంగా బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. వీటిలో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడం, భద్రపరచడం వంటి ఇబ్బందులు ఉండవు. వ్యక్తిగత వినియోగం, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఆభరణాలు అనుకూలం. భౌతిక బంగారాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారికి నాణేలు మెరుగైన ప్రత్యామ్నాయం. ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయాలనుకునేవారికి డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉంది. అయితే ఏ రూపంలో కొనుగోలు చేసినా ధర, అదనపు ఛార్జీలు, విక్రయించే సౌలభ్యం, నష్టభయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Papiya Adhikari | టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- ●Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●China Lab Grown Gold | ల్యాబ్ గోల్డ్ మోసం: చైనా సరికొత్త దందా..!
- ●Bhogi Movie | మరోసారి శర్వానంద్ `భోగి` విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?
- ●Nvidia | జెన్సన్ హువాంగ్ వివాదం.. ఎన్విడియా షేర్లు పతనమవుతాయా?
- ●Chhattisgarh | త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ.. సోషల్ మీడియా చూసి మేనల్లుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు తొలగించిన నిందితుడు

Papiya Adhikari | టపాసులు కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar | ఎన్నికల వరకే రాజకీయాలు : మంత్రి పొన్నం ప్రభాకర్

China Lab Grown Gold | ల్యాబ్ గోల్డ్ మోసం: చైనా సరికొత్త దందా..!

Bhogi Movie | మరోసారి శర్వానంద్ `భోగి` విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?






