త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

China Lab Grown Gold | ల్యాబ్ గోల్డ్ మోసం: చైనా సరికొత్త దందా..!

చైనాలో బంగారం పేరుతో జరుగుతున్న భారీ మోసాలు, ల్యాబ్ గోల్డ్ వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటో తెలుసుకోండి. బంగారం కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

J

Science | Published On Nov 9, 2026, 12.38 pm IST

China Lab Grown Gold | ల్యాబ్ గోల్డ్ మోసం: చైనా సరికొత్త దందా..!

సంక్షిప్త సారాంశం

చైనాలో బంగారంలో ఇతర లోహాలను కలిపి విక్రయిస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ లో స్వచ్ఛమైన బంగారాన్ని తయారు చేయడం శాస్త్రీయంగా చాలా ఖర్చుతో కూడుకున్నది, ప్రస్తుతానికి వాస్తవ రూపం దాల్చలేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే నకిలీ '999 గోల్డ్' ఆఫర్ల పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి. హాల్‌మార్క్, జీఎస్టీ బిల్లుతో కూడిన సర్టిఫైడ్ బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయడం సురక్షితం.

Advertisement
  • చైనా దొంగ బంగారం వెనుక అసలు నిజం
  • మార్కెట్లో కలకలం రేపుతున్న మోసాలు ఇవే

China Lab Grown Gold | త్రినేత్ర న్యూస్ : ప్రపంచ మార్కెట్‌లో చైనాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్తలు వస్తాయో ఊహించడం కష్టం. తాజాగా చైనా నుంచి వస్తున్న కొన్ని నివేదికలు బంగారు ప్రియులను షాక్‌కు గురిచేస్తున్నాయి. చైనాలో బంగారంలో స్వల్పంగా ఇతర లోహాలను కలిపి అచ్చం అసలు బంగారంలా కనిపించేలా విక్రయిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు మార్కెట్లో దొరుకుతున్నది ఒరిజినల్ బంగారమా లేక మోసపూరితమైనదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ల్యాబ్ గోల్డ్ సాధ్యమేనా? డైమండ్స్‌కి దీనికి తేడా ఏమిటి?

కొంతకాలంగా మార్కెట్లో 'ల్యాబ్ గ్రోన్ డైమండ్స్' హవా నడుస్తోంది. ల్యాబ్‌లో తయారు చేసే డైమండ్స్‌కి, ఒరిజినల్ డైమండ్స్‌కి పెద్దగా తేడా ఉండకపోవడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో సహజమైన డైమండ్స్ ధరలు క్రమంగా తగ్గాయి. ఇదే సూత్రం బంగారానికి కూడా వర్తిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే, డైమండ్ అనేది కేవలం 'కార్బన్' మూలకం కావడంతో దానిని ల్యాబ్‌లో కృత్రిమంగా సులభంగా తయారు చేయవచ్చు. కానీ బంగారం అనేది 'అటామిక్ నెంబర్ 79' కలిగిన ఒక ప్రత్యేకమైన మూలకం (Element).

భారీ కుంభకోణాలు, శాస్త్రీయ వాస్తవాలు

చైనాలో కొన్ని జ్యూయెలరీ సంస్థలు వందల కిలోల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి భారీ బ్యాంక్ లోన్‌లు పొందిన కుంభకోణాలు వెలుగు చూశాయి. ఈ గోల్డ్ బార్లను పరిశీలిస్తే వాటిలోపల రాగి (Copper) ఇతర లోహాలు ఉన్నట్లు తేలింది. సాధారణ క్యారెటోమీటర్ లేదా యాసిడ్ టెస్ట్‌లకు కూడా చిక్కని రీతిలో ఈ కల్తీ జరుగుతుండటం ఆందోళనకరమైన విషయం.

సైంటిఫిక్ నిపుణుల ప్రకారం, న్యూక్లియర్ ఫిజోన్ (Nuclear Fusion) ద్వారా పార్టికల్ యాక్సిలరేటర్లను ఉపయోగించి అతి సూక్ష్మమైన బంగారు కణాలను సృష్టించడం సైంటిఫిక్‌గా సాధ్యమైనప్పటికీ, దానికయ్యే ఖర్చు బంగారు విలువ కంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కమర్షియల్ స్థాయిలో ల్యాబ్‌లో అసలు బంగారాన్ని తయారు చేయడం ప్రస్తుతానికి ఎవరివల్లా సాధ్యం కాదు.

కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మార్కెట్‌లో రకరకాల రూమర్స్ వస్తున్నప్పటికీ, సహజమైన బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అయితే ఫెస్టివ్ సీజన్ లేదా ధనతేరస్ సమయాల్లో ఆన్‌లైన్‌లో తక్కువ ధరలకు లభించే '999 గోల్డ్' లేదా సర్టిఫైడ్ కాని ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఎప్పుడైనా సరే పేరున్న రిప్యూటెడ్ జ్యువెలరీ షాపుల నుంచే కొనుగోలు చేయండి.

బీఐఎస్ (BIS) హాల్‌మార్క్, జీఎస్టీ (GST) అధికారిక బిల్లుతో కూడిన బంగారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా నకిలీ మోసాల బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు.

Advertisement
Advertisement